వ్య‌క్తిగ‌త దూష‌ణ‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ మంత్రి అన్న హోదాను మ‌రిచిపోయి మాట్లాడుతున్నారు కొడాలి నాని. ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా టీడీపీ నాయ‌కులు, పాత స్నేహితులు కూడా చాలా అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు.నిన్న‌మొన్న‌టి దాకా ఇక్క‌డే ఉండి రాజ‌కీయ జీవితాన్ని అనుభ‌వించి,ఇప్పుడు మాత్రం మంత్రి ప‌దవి రాగానే ముఖ్య‌మంత్రి మెప్పు కోసం నోటికి వ‌చ్చిన విధంగా మాట్లాడ‌డంలో అస్స‌లేమ‌యినా అర్థం ఉందా? అంటూ నాని సామాజిక‌వ‌ర్గంకు చెందిన మ‌నుషులు విచారం వ్య‌క్తం చేస్తున్నారు. రాజకీయంలో తిట్టుకోవ‌డం వెరీ కామ‌న్ అయినా కానీ చంద్ర‌బాబును, లోకేశ్ ను వెనుకా ముందూ చూడ‌కుండా తిట్ట‌డం వెనుక జ‌గ‌న్ హ‌స్తం ఉంద‌ని బ‌లీయ‌మైన ఆరోప‌ణ ఒక‌టి క‌మ్మ సామాజిక వ‌ర్గ టీడీపీ నేత‌లు చేస్తున్నారు. రాజ‌కీయం పేరిట చంద్ర‌బాబు సొంత కులంలో కుంప‌ట్లు రాజేయ‌డం త‌గ‌ద‌ని కూడా కొందరు జ‌గ‌న్ కు హిత‌వు చెబుతున్నారు. అయితే ఆ రోజు త‌న‌ను నెల్లూరుకు చెందిన సోమిరెడ్డితో ఎలా తిట్టించారో తానెలా మ‌రిచిపోతాన‌ని అదే సూత్రం ఇప్పుడు తాను వ‌ర్తింప‌జేస్తే త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని జ‌గ‌న్ అంటున్నార‌ని స‌మాచారం. అంటే చంద్ర‌బాబు ఫార్ములా, జ‌గ‌న్ ఫార్ములా ఒక్క‌టేన‌ని తేలిపోయింది.ఇంకేం ఇంకా బాగా తిట్టుకోండి..ప్ర‌జా స‌మ‌స్య‌లు గాలికి వ‌దిలేసి రోజూ మీడియా మైకుల ముందు కొత్త కొత్త బూతులు వెతుక్కుని మ‌రి! తిట్టుకోండి.



కొద్ది రోజులుగా న‌లుగుతున్న విష‌యంపై జ‌గ‌న్ మాట్లాడ‌డం లేదు.అదేవిధంగా నానీ మాత్రం మాట్లాడుతూ మాట్లాడుతూ చంద్ర‌బాబు ను తిడుతున్నారు.ఆయ‌న ఇంట్లో వ్య‌భిచారం జ‌రుగుతుంద‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.ఇవి ఇలా న‌డుస్తుండ‌గానే సీన్ లోకి బుద్ధా వ‌చ్చారు. అయితే బుద్ధా, నానిమీడియా వేదిక‌గా కాస్త చ‌ల్ల‌బ‌డ్డారు. ఒక‌రినొక‌రు తిట్టుకోబోమ‌ని చెప్పుకున్నారు కూడా! దీంతో రాజీ అన్న‌ది ఓ కొలిక్కి వ‌చ్చింద‌నే భావించాలి. ఈ మొత్తం ఎపిసోడ్లో చంద్ర‌బాబును నోటికి వ‌చ్చిన విధంగా తిట్ట‌మ‌ని జ‌గ‌న్ ఏమ‌యినా ఆదేశాలు ఇచ్చారా అన్న అనుమానాలు అయితే మాత్రం మంత్రి నాని విష‌యంలో తలెత్తుతున్నాయి.


ఆంధ్రావ‌ని రాజ‌కీయాలు అన్నీ రెండు వారాలుగా వేడెక్కి ఉన్నాయి.చ‌లి గాలులు కూడా అలానే ఉన్నాయి కానీ రాజ‌కీయ వాతావ‌ర‌ణం మాత్రం వేడి త‌గ్గ‌కుండా ఉంది.ముఖ్యంగా పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నానికి చెందిన క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో సంక్రాంతి పండుగ సంద‌ర్భంలో క్యాసినో నిర్వ‌హించార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతుండ‌డంతో  టీడీపీ నిజ నిర్థార‌ణ‌కు ఓ క‌మిటీని నియ‌మించింది.ఈ క‌మిటీ ఘ‌ట‌నా స్థ‌లికి వెళ్తుండ‌గా పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పాటు బోండా ఉమా వాహ‌నం అద్దాల‌ను మంత్రి అనుచ‌రులు ప‌గులగొట్టారు.ఇవ‌న్నీ విజువ‌ల్ గా రికార్డ్ అయినప్ప‌టికీ ఇప్ప‌టిదాకా సంఘ‌ట‌న‌కు బాధ్యుల‌యిన వారిపై చ‌ర్య‌లే లేవు.తాజాగా నిజ నిర్థార‌ణ క‌మిటీ త‌మ అధినేత చంద్ర‌బాబును క‌లిసి నివేదిక‌ను అందించింది. జాతీయ స్థాయిలో మంత్రి నాని నిర్వాకంపై పోరాడతామ‌ని అంటున్నారు వ‌ర్ల రామ‌య్య అండ్ కో. బాబును క‌లిసిన వారిలో మాజీ మంత్రులు కొల్లు ర‌వీంద్ర, ఆల‌పాటి రాజా త‌దిత‌రులు ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp