ఏపీలో బీజేపీకి గెలుపుపై ఆశలు ఉన్నాయా? అంటే ఉన్నాయనే చెప్పొచ్చు. ప్రతి రాజకీయ పార్టీకి గెలుపుపై ఆశలు ఉంటాయి..అలాగే బీజేపీకి ఉన్నాయి. కాకపోతే బీజేపీకి గెలుపు అంటే.. కాస్త కామెడీగా ఉందని అనుకోవచ్చు. అసలు ఒక సర్పంచ్ పదవి కూడా గెలుచుకోలేని పరిస్తితుల్లో ఉన్న బీజేపీకి ఒక ఎమ్మెల్యే సీటు కూడా రావడం అనేది గగనమే. కానీ ఆ పార్టీ మాత్రం ఎలాగైనా సత్తా చాటాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది. కాకపోతే ఎంత పనిచేసిన బీజేపీకి ఉపయోగం లేదు. ఎందుకంటే ఏపీ ప్రజలకు బీజేపీపై నమ్మకం లేదు. పైగా కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రానికి చేసింది ఏమి లేదు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అలాగే ఉన్నాయి...దీంతో ప్రజలు బీజేపీపై గుర్రుగా ఉన్నారు.

అందుకే గత ఎన్నికల్లో బీజేపీకి ఒక శాతం కూడా ఓట్లు రాలేదు...కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఏపీలో బీజేపీ నేతల హడావిడి కాస్త ఎక్కువగా ఉంది. అలా అని వారికి బలం మాత్రం లేదు. ఇప్పుడు ఏపీ బీజేపీ నేతల్లో ఒక్కరికీ కూడా ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు లేవు. కానీ గతంలో మంత్రులుగా పనిచేసిన వారు బీజేపీలో ఉన్నారు. వారు బీజేపీలోకి వెళ్ళాక రాజకీయంగా వెనుకబడిపోయారు. బీజేపీలో ఉంటే వారు గెలవడం జరిగే పని కాదు.

అందుకే బీజేపీలో చాలామంది నేతలు టీడీపీతో పొత్తు ఉంటే బెటర్ అని భావిస్తున్నారు. జనసేనతో పొత్తులో ఉన్నా సరే ప్రయోజనం ఉండదని వారికి అర్ధమవుతుంది. జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్ళినా సరే బీజేపీకి ఒక సీటు కూడా రావడం కష్టమే. అదే టీడీపీతో కలిస్తే మూడు, నాలుగు సీట్లు గెలుచుకోవచ్చని అనుకుంటున్నారు. కానీ బీజేపీలో ఉన్న మరికొందరు టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఒప్పుకోవడం లేదు. దీంతో పొత్తు అంశం ఎటు తేలకుండా ఉండేలా ఉంది.

సరే జనసేనతో కలిసి వెళితే బీజేపీకి ఒక సీటులో కాస్త అవకాశం ఉందని చెప్పొచ్చు. అది విశాఖ నార్త్ సీటు...అక్కడ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు మంచి ఫాలోయింగ్ ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ విష్ణుకు దాదాపు 19 వేల ఓట్ల వరకు పడితే, జనసేనకు 19 వేలు ఓట్లు పడ్డాయి. అంటే ఇంకొంచెం కష్టపడితే నార్త్‌లో బీజేపీకి కాస్త గెలిచే ఛాన్స్ ఉంది. మరి చూడాలి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పరిస్తితి ఏం అవుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp