ఇటీవలి కాలంలో దొంగల బెడద ఎక్కడ చూసినా ఎక్కువ అవుతుంది అన్న విషయం తెలిసిందే. అక్కడ ఇక్కడ అనే తేడా లేదు ప్రతీచోటా దొంగలు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలా ఇటీవలి కాలంలో ఎంతోమంది దోపిడి దొంగలు చేస్తున్న చో్రీలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటి వరకు కేవలం తాళం వేసి ఇళ్లలో మాత్రమే దొంగతనాలకు పాల్పడే వారు దొంగలు. కానీ ఇటీవలి కాలంలో ఏకంగా ప్రముఖ ఆలయాలలో దొంగతనాలకు పాల్పడుతూ ఉండడం గమనార్హం. తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ఏం వస్తుంది అనుకుంటున్నారో ఏమో.. ఏకంగా ఆలయాలలో ఉన్న హుండీ దొంగిలిస్తే భారీగా చోరీ చేయవచ్చు అన్నట్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నారు.



 అయితే ఇప్పుడు వరకు చిన్నా చితకా ఆలయాలలో మాత్రమే దొంగలు చోరీకి పాల్పడేవారు. కానీ ఇటీవలే తెలంగాణలో ప్రముఖ క్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో చోరీకి పాల్పడటం సంచలనం గా మారిపోయింది. ఏకంగా సీసీ కెమెరాల నిఘా లో ఉండే ఆలయంలో చోరీ జరగడం  పోలీసులకు సవాల్ విసిరింది అని చెప్పాలి. పాపన్నపేట లో ఉన్న దుర్గ మాత ఆలయంలో గర్భాలయంలో ఉన్న చోరీకి పాల్పడ్డాడు దొంగ. ఈ క్రమంలోనే ఇక ఉదయం వచ్చిన సిబ్బంది దొంగతనం జరిగింది అని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయడం మొదలుపెట్టారు.


ఏడుపాయల వన దుర్గ మాత ఆలయంలో దొంగతనానికి పాల్పడిన దొంగ ఎవరు అనే విషయం ఇటీవల బయటపడింది. ఇక ఆ దొంగను అరెస్టు చేసిన పోలీసులు హుండీ ఆదాయం లో దొంగిలించిన సొమ్మును మొత్తం మళ్లీ రికవరీ చేశారు. ఈ క్రమంలోనే హుండీ పగల గొట్టి దొంగలించిన 2.80 లక్షల నగదు 7.5 తులాల బంగారం 250 గ్రాముల వెండి ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఆలయ అధికారులకు అప్పగించారు. కామారెడ్డి జిల్లా ఆత్మకూరు కు చెందిన లక్ష్మారెడ్డి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: