మొన్నటి వరకు రెండు దశల కరోనా వైరస్ ని ఎదుర్కొన్న ప్రపంచదేశాలు ఎంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాయో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎంతోమంది పై  వైరస్ పంజా విసరడం ఎంతోమంది ప్రాణాలు కూడా తీసుకోవడంతో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు రావడంతో పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాయి అని చెప్పాలి. కానీ ఇటీవలే సౌతాఫ్రికాలో  ఒక ప్రమాదకరమైన కోత వేరియంట్  ఓమిక్రాన్ వెలుగులోకి రావడంతో ప్రపంచ దేశాలు మళ్లీ భయాందోళనలో మునిగి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే సౌతాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్ చాప కింద నీరులా ప్రపంచ దేశాలకు పాకిపోయింది.



 చూస్తూ చూస్తూండగానే అన్ని దేశాలలో కూడా ఓమిక్రాన్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోయింది. ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అటు ప్రపంచ దేశాలలో కూడా కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇక రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోవడంతో అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అన్ని దేశాలకు జాగ్రత్తలు పాటించాలి అంటూ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ఇటీవలి కాలంలో దాదాపు అన్ని దేశాలకు ఓమిక్రాన్ వ్యాపించగా.. రోజు రోజుకు కేసుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. అయితే ఓమిక్రాన్ డెల్టా వేరియంట్ కంటే  ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినప్పటికీ ప్రస్తుతం చూస్తే మాత్రం ఓమిక్రాన్  ప్రభావం కాస్త తక్కువగానే ఉంది అనేది తెలుస్తుంది.



 ఈ కొత్త వేరియంట్ బారిన పడి కేవలం మూడు నుంచి నాలుగు రోజుల్లోనే కోరుకుంటున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఓమిక్రాన్ కేవలం గొంతుకే    పరిమితం అవుతుండటంతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా తగ్గుతుందని.. హోమ్ క్వారంటైన్  లో ఉంటూ చికిత్స తీసుకొని కోరుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఓమిక్రాన్ వైరస్ బారినపడి బయటపడిన తర్వాత అందరిలో జలుబు జ్వరం గొంతునొప్పి లాంటి లక్షణాలు తగ్గినప్పటికీ దగ్గు తలనొప్పి ఒళ్లు నొప్పులు నీరసం వంటి సమస్యలు మాత్రం వదలడం లేదట. ఇలా వైరస్ నుంచి బయటపడిన వారిలో ఎన్నో రోజుల పాటు ఇలాంటి సమస్యలు వేధిస్తున్నట్లు తెలిస్తుంది. అయితే ఇలాంటి లక్షణాలకు భయపడాల్సిన అవసరం లేదని దానికి తగినట్లుగా మందులు తీసుకుంటే కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి అంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: