కరోనా పుణ్యమా అని ఈ రోజు ఎందరో సాప్ట్ వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. ఒక రకంగా చాలా మంది ఈ పద్ధతిని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ కరోనా ఎందరో జీవితాలను నాశనం చేసింది. ప్రస్తుతం కరోనా కేసులు రోజు రోజుకీ తగ్గుతున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం కాస్త జాగ్రత్తగానే ఉంది. సంక్రాతి పండుగ ముందు వరకు ఒక రకంగా ఉన్న కరోనా కేసులు ఒక్క సారిగా లక్షల్లోకి చేరుకున్నాయి. దీనితో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై అన్ని జిల్లా కేంద్రాలను అలెర్ట్ చేసింది. అంతే కాకుండా కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్ లకు ఇచ్చింది. కరోనా నియమ నిబంధనలను పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగానే రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. అయితే ఈ గడువు కాస్త గత రాత్రితో ముగిసింది. అయితే అందరూ నైట్ కర్ఫ్యూ ఇక ఉండదేమో అని అనుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అందరి ఊహలకు అతీతంగా నైట్ కర్ఫ్యూ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపటి క్రితం చేసింది. ఎప్పటిలాగే రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఇది అమలులో ఉండనుంది. సరిగ్గా ఇక రెండు వారాల పాటు ఈ నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది. అయితే ఈ కరోనా థర్డ్ వేవ్ లో పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు అని చెప్పాలి. కేవలం వ్యాప్తి మాత్రమే వేగంగా ఉంది.

అంతే కాకుండా కరోనా సోకిన వారు కేవలం వారం రోజుల వ్యవది లోనే రికవరీ అవుతున్నట్లు రికార్డ్స్ చెబుతున్నాయి.  కానీ కొందరు శాస్త్రజ్ఞులు చెబుతున్న ప్రకారం ఇది కేవలం ఆరంభమే అని ఇంకో రెండు నెలల్లో అసలైన జాతర మొదలు కానుంది అని అంటున్నారు. మరి ముందు ముందు ఏమి జరగనుంది అనేది తెలియాలంటే ఎదురుచూడగా తప్పదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: