రాజకీయాల్లో కింది స్థాయి నుంచి ఎదిగిన నాయకులు చాలా తక్కువ ఉంటారని చెప్పొచ్చు..ఏదో గతంలో అలా ఉండేవారు గాని..ఇప్పుడు అంతా వారసత్వ రాజకీయాలే నడుస్తున్నాయి. ఇక ఇలాంటి రాజకీయాలు నడుస్తున్న సమయంలో కూడా కింది స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఒక సర్పంచ్‌గా రాజకీయ జీవితం మొదలైంది. తన సొంత వూరు బేతంచెర్ల నుంచి రెండుసార్లు సర్పంచ్‌గా గెలిచారు. ఇలా సర్పంచ్‌గా రాజకీయాలని మొదలుపెట్టిన బుగ్గన వైసీపీలో చేరి కీలక నాయకుడుగా ఎదిగారు.

అలాగే 2014 ఎన్నికల్లో డోన్ వైసీపీ సీటు దక్కించుకున్నారు...ఇక అక్కడ రాజకీయంగా బలంగా ఉన్న కే‌ఈ కృష్ణమూర్తి ఫ్యామిలీని ఢీకొట్టడం బుగ్గనకు అసాధ్యం అని అంతా అనుకున్నారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు....తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. ఇక అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా రాణించారు..అసెంబ్లీలో సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతూ..అప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. అలా బుగ్గన అందరికీ తెలిశారు.

ఇక 2019 ఎన్నికల్లో మరొకసారి డోన్ నుంచి నిలబడి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు..అయితే ప్రతిపక్షంలో ఉండి పోరాడితే నాయకుల సత్తా బయటపడుతుంది...అధికార పక్షంలో ఇంకా సత్తా చాటే అవకాశాలు ఉంటాయి. కానీ అధికారంలోకి వచ్చాక బుగ్గన రివర్స్‌లో వెళుతున్నట్లు కనిపిస్తున్నారు...ప్రతిపక్షంలో ఉండగా బుగ్గనకు పాజిటివ్ ఉండేది..ఇప్పుడు అధికారంలో ఉంటూ, పైగా ఆర్ధిక మంత్రిగా ఉన్నారు...అయినా సరే బుగ్గనపై నెగిటివ్ పెరుగుతున్నట్లు కనబడుతోంది. డోన్ నియోజకవర్గంలో బుగ్గనకు అంత అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు.

ఆర్ధిక మంత్రిగా ఉన్నా సరే డోన్‌కు ఈ రెండున్నర ఏళ్లలో పెద్దగా ఒరిగింది ఏమి లేదు..పైగా ఆర్ధిక మంత్రి అంటే అప్పుల మంత్రి అన్నట్లు బుగ్గన పరిస్తితి తయారైంది..దీంతో బుగ్గనకు రాజకీయంగా ఇబ్బందులు మొదలయ్యాయి. పైగా తాజాగా డోన్ మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్ టీడీపీలో చేరిపోయారు. అసలు అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలో చేరడం అనేది పెద్ద ఇబ్బంది. ఆ ఇబ్బంది బుగ్గనకు వచ్చింది...మరి చూడాలి ఈ పరిస్తితుల్లో బుగ్గన హ్యాట్రిక్ కొడతారో లేదో.


మరింత సమాచారం తెలుసుకోండి: