ఇక ఇటీవలే ఇదే విషయంపై వామపక్ష పార్టీల రాష్ట్ర సదస్సులో పేర్కొన్నారు కొంతమంది వ్యక్తలు. సదస్సుకు హాజరైన పది వామపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈ సందర్భంగా ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈనెల 21వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు వస్తారు అని చెబుతున్నారు. ఇలా విశాఖకు వచ్చిన రోజునే రైల్వే జోన్ ప్రత్యేక హోదా మీద ప్రధాని ప్రకటన చేయాలి అంటూ వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశాయ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అంగీకరించే ప్రసక్తి లేదు అంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తే అటు బీజేపీకి పుట్టగతులు ఉండవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు అంటూ విమర్శలు గుప్పించారు. ఇక కరోనా వైరస్ కష్ట సమయంలో ఉద్దీపన పథకాల పేరుతో కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కట్టబెట్టిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ లో పేదలకు అన్యాయం జరిగిందని కార్పొరేట్ కంపెనీలకు మాత్రం ఊడిగం చేసే విధంగానే ఈ ఆర్థిక బడ్జెట్ వుంది అంటూ దుయ్యబట్టారు. ఆర్థిక బడ్జెట్ లో ఏపీకి పూర్తిగా అన్యాయం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు పక్షాల నేతలు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి