ఈనెల 14న పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జనసేన ఆవిర్భావ సభ జరగబోతోంది. దీనిపై ఇప్పటికే జనసైనికులు చాలా ఎక్స్ పెక్టేషన్లు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే నాదెండ్ల మనోహర్ కూడా భారీగా ఎలివేషన్లు ఇచ్చారు. పవన్ కల్యాణ్ కీలక ఉపన్యాసం చేస్తారని అన్నారు. అయితే ఆయన ఏం మాట్లాడతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

ఇటీవల చంద్రబాబు నుంచి వన్ సైడ్ లవ్ ప్రపోజల్ వచ్చినమాట వాస్తవమే. భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ టైమ్ లో కూడా అటు తెలంగాణలో బీజేపీ వైరి వర్గం టీఆర్ఎస్ మంత్రుల్ని పిలిచి ఫంక్షన్ జరిపించుకున్నారు పవన్ కల్యాణ్. ఇటు ఏపీలో టీడీపీ భీమ్లా నాయక్ కి సపోర్ట్ గా నిలిచింది. సినిమా రిలీజ్ విషయంలో ప్రభుత్వం అడ్డుపడుతోందంటూ మండిపడింది. ఆ దశలో కనీసం బీజేపీ నుంచి పవన్ కి కానీ, పవన్ సినిమాకి కానీ సపోర్ట్ లేదు. దీంతో పవన్ కల్యాణ్ తన పార్టీ ఆవిర్భావ సభలో బీజేపీ గురించి ఏవైనా కీలక వ్యాఖ్యలు చేస్తారేమోననే అనుమానం అందరిలో ఉంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో సీన్ మారిందా..?
పవన్ సంచలన ప్రకటన, కీలక ఉపన్యాసం అంటే.. అది కచ్చితంగా పొత్తులపైనే ఉంటుందని భావిస్తున్నారంతా. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించడం. యూపీ సహా మొత్తం 4 రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో పవన్ స్పీచ్ మారిపోయిందని చెబుతున్నారు ప్రస్తుతం పవన్ బీజేపీకి అనుకూలంగా, బీజేపీతోనే తమ ప్రయాణం ఉంటుంది అనేట్టుగా మాట్లాడతారని కూడా వార్తలు వస్తున్నాయి. వీటిల్లో ఏది నిజం అనేది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. మొత్తానికి పవన్ కల్యాణ్ మాత్రం జనసేన ఆవిర్భావ సభలో జనసైనికులకు మంచి ఊపునిచ్చే ప్రసంగం చేయబోతున్నారని అర్థమవుతోంది. దానివల్ల పవన్ కి రాజకీయంగా లాభం ఉంటుందా, లేక నష్టం ఉంటుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

జనసేన ఆవిర్భావ సభకు భారీగా జన సమీకరణ జరుగుతోంది. జిల్లాలనుంచి పెద్ద సంఖ్యలో జనసైనికులు తరలి వస్తున్నారు. ఇప్పటికే నాయకులంతా జిల్లాలనుంచి బయలుదేరారు. సరిగ్గా సభ రోజు.. జిల్లాలనుంచి ప్రత్యేక వాహనాల్లో జనసైనికులు సభా ప్రాంగణానికి వస్తారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: