
ఇంతకీ విషయం ఏమిటంటే అప్పుడెప్పుడో పవన్ కర్నూలులో పర్యటించారు. అక్కడ జరిగిన బహిరంగసభలో మాట్లాడుతు ‘రాష్ట్ర ప్రజలందరికీ అమరావతి రాజధాని కావచ్చు కానీ తన మనసు కు మాత్రం కర్నూలే రాజధాని’ అని అన్నారు. ఆ తర్వాత వైజాగ్ లో కూడా పర్యటించారు. అప్పుడు విశాఖ సభలో మాట్లాడుతు రాష్ట్ర రాజధానిగా వైజాగ్ నగరానికి మించిన నగరం రాష్ట్రం లోనే లేదన్నారు. వైజాగ్ ను రాజధానిగా చేస్తే బాగుంటుందని కూడా అభిప్రాయపడ్డారు.
ఆ మధ్య విశ్రాంత చీఫ్ సెక్రటరీ ఐ వై ఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరికోసం అమరావతి రాజధాని’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతు అమరావతి రాజధానిని చంద్రబాబు కేవలం ఒక సామాజికవర్గం కోసం మాత్రమే పెట్టినట్లు ఆరోపించారు. అమరావతి అనేది పెట్టుబడి వర్గాల కోసమే చంద్రబాబు రెడీ చేస్తున్నట్లు మండిపడ్డారు.
ఏపీ రాజధానిగా ఒకసారి కర్నూలని, మరోసారి విశాఖను మించిన నగరం లేదని చెప్పిన పవన్ ఇపుడు రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని, ఎక్కడికి వెళ్ళదని చెప్పారు. అంటే పవన్లో ఇన్నిరకాల షేడ్లున్నాయని మామూలు జనాలకు తెలుసుకోలేకపోయారు. ఇదే విషయాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. అంటే వివిధ సందర్భాల్లో డైలాగులు విన్నతర్వాత పవన్ లో కూడా అపరిచితుడు ఉన్నట్లే కదాని నెటిజన్లు తీర్మానించేశారు.