చంద్రబాబుకు వైసీపీ నేతలు కొత్త ఛాలెంజ్ విసురుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలపైన ఏరోజూ మీరు డిబేట్ చేయరని... వ్యవస్థలను నిర్వార్యం చేస్తున్నట్టు విమర్శలు చేస్తున్నారని... వ్యవస్థలపై మాకు అచెంచలమైన విశ్వాసం, గౌరవం, నమ్మకం ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. వ్యవస్థలను అడ్డు పెట్టుకుని మాపై బురదజల్లుతున్న చంద్రబాబు అండ్ కో కు మాత్రమే వ్యవస్థలపై గౌరవం లేదని వైసీపీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు.
చంద్రబాబుది నిమిషానికో మాట.. పూటకో విధానం అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని.. తద్వారా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశాడని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. గతంలోనూ, భవిష్యత్తులోనూ మరే నాయకుడూ చేయలేని విధంగా జగన్ కొత్త జిల్లాలు చేశాడని వైసీపీ నేతలు ఘనంగా చెబుతున్నారు.
13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి, ప్రజలకు మేలు చేసేలా జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ అమలు చేస్తున్న పథకాల్లో మంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు కనిపించడం లేదా అని వైసీపీనేతలు విమర్శిస్తున్నారు. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, నాడు-నేడు పథకాలను గుర్తుచేస్తున్నారు. ఇవన్నీ మీ కళ్ళకు ఎందుకు కనిపించటం లేదని ప్రశ్నిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి