విదేశీ మారక నిల్వలు పడి పోయిన కారణంగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ద్వీప దేశం అయిన శ్రీలంకలో పరిస్థితులు రోజు రోజుకు మరింత దారుణంగా మారుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల వలన ఈ ప్రభావం ప్రజల పై తీవ్రంగా ఉంటోంది. డాలర్‌తో పోలిస్తే శ్రీలంక రూపాయి (ఎల్‌కేఆర్) అత్యంత కనిష్ఠానికి చేరుకోవడం గమనార్హం. ఈ స్థాయిలో అక్కడ ఎల్ కే ఆర్ విలువ పడి పోవడం ఇదే తొలిసారని చెబుతున్నారు. అమెరికా డాలర్ మంగళవారం 300 ఎల్‌కేఆర్‌ను చేరినట్లు సమాచారం.
ఇదే విషయాన్ని శ్రీలంక బ్యాంకులు సైతం చెబుతున్నాయి. డాలర్ రేట్లు ఇలా తారు మారు అవుతాయని అనుకోలేదు అంటూ వారు వాపోతున్నారు. డాలర్ మారకపు రేటు 310 ఎల్‌కేఆర్ కు చేరిందని, అంతే కాకుండా దీని రేటు ప్రాంతాలను బట్టి కొద్దిగా మార్పులు ఉన్నాయని, కొన్ని బ్యాంకుల్లో ఇది 312గా ఉందని చెబుతున్నారు.
విదేశీ మారక నిల్వలు కారణం గానే ఈ భారీ మార్పులు జరిగాయని అంటున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి ఇది అంటూ స్థానిక మీడియా తెలిపింది.
ఎల్‌కేఆర్‌తో పోలిస్తే యూఎస్ డాలర్ 300ను చేరడం ఇదే మొదటి సారి అని... ఇది ఆశ్చర్యకరమైన విషయం అని అక్కడ ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు. విదేశీ మారక నిల్వలు నిండుకోవడంతో ఆయిల్ కొరత వచ్చి ఇలా జరిగిందని ఇదే ప్రధాన కారణమని అంటున్నారు. దీంతో పాటు నిత్యం గంటల కొద్దీ విద్యుత్ కోతలు ఇబ్బంది పెడుతున్నాయి అని విద్యుత్ సరఫరా సరిగా లేక పోవడం చేత ఆర్ధిక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా వీటితో శ్రీలంక పౌరులు అల్లాడిపోతున్నారు అని సమస్యలతో బాధ పడుతున్నారు అని మీడియాలు చెబుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి