జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని పెందుర్తి మండలంలో రోడ్డుషో, ర్యాలీ, స్ధానికులతో సహపంక్తి భోజనం లాంటవన్నీ జరిగాయి. అన్నీ బాగానే ఉన్నాయికానీ చంద్రబాబు స్పీచ్ మాత్రం ఆకట్టుకునేట్లులేదు. ఎందుకంటే ఎప్పటిదో పాతచింతకాయ పచ్చడి లాంటి విషయాలనే తిప్పి తిప్పి అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులాగ వినిపించటం వల్ల ఉపయోగంలేదు.
అసెంబ్లీలో తన కుటుంబసభ్యులను అవమానించారని చెప్పారు. ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇపుడు ప్రస్తావించటం వల్ల ఎలాంటి ఉపయోగంలేదు. జగన్ మాయలోపడి వైసీపీకి 151 సీట్లు కట్టబెట్టారని నిష్టూరాలాడారు. ఎప్పుడో 2019లో జరిగిన విషయాన్ని ఇపుడెందుకు ప్రస్తావించారో అర్ధం కావటంలేదు. తనను పాలనను భరించలేకే జనాలు ఘోరంగా ఓడించిన విషయాన్ని మరచిపోయినట్లున్నారు. వైసీపీకి ఓట్లేసి గెలిపించినందుకు జనాలకు ఇప్పటికీ శాపనార్ధాలు పెడుతునే ఉన్నారు. ఒకవైపు జనాలను తప్పుపడుతు మరోవైపు తనకు ఓట్లేయమంటే జనాలు ఎలా వేస్తారు ?
అలాగే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తాను ఎంత అద్భుతంగా పరిపాలించానో చెప్పుకున్నారు. నిజంగానే అంత అద్భుతంగా పరిపాలించుంటే మరి 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకే ఎందుకు పరిమితమైంది ? అద్భుతంగా పాలించినట్ల చెప్పుకోవాల్సింది తాను కాదని జనాలన్న విషయాన్ని కూడా చంద్రబాబు మరచిపోయారు. సీఎంగా ఉన్నపుడు తాను రాష్ట్రాన్ని దోచుకోలేదని, కానీ జగన్ మాత్రం ఇపుడు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నట్లు ఆరోపించారు.
జగన్ పాలనలో రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందని చెప్పటమే ఆశ్చర్యం. అసలు శ్రీలంకలో పరిస్ధితికి ఏపీలో పరిస్ధితికి పోలికేమిటో ఎకనమిక్స్ చదివిన చంద్రబాబుకు అర్ధంకాకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. పైగా సంక్షేమపథకాలకు తాను 51 శాతం ఖర్చుపెడితే ఇపుడు జగన్ 43 శాతమే ఖర్చు పెడుతున్నట్లు మండిపడ్డారు. అంటే తాను జగన్ కన్నా ఎక్కువ ఖర్చుపెట్టినపుడే ఏపీ శ్రీలంకలాగ కానపుడు ఇఫుడు మాత్రం ఎందుకవుతుంది ? తాను జగన్ పై చేసిన ఆరోపణలు నిజంకాదని అనుకుంటే టీడీపీకి ఓట్లేయద్దని చంద్రబాబు చెప్పటమే పెద్ద జోక్. ఒకవైపు జగనేమో తన పాలన చూసి ఓట్లేయమని చెబుతుంటే చంద్రబాబేమో జగన్ పై ఆరోపణలు నిజంకాకపోతే ఓట్లేయద్దని అడగమే విచిత్రం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి