ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిపైన బురదచల్లాలి అనేది టార్గెట్.  ప్రతిరోజు బురద ఎలా చల్లాలనేది పెద్ద సమస్యగా మారిపోయింది. అందుకనే సంబంధంలేని అంశాల్లో కూడా జగన్ను లాగేసి బురద చల్లేస్తోంది ఎల్లోమీడియా. ఇందుకు ఇదే తాజా ఉదాహరణ. ఇంతకీ విషయం ఏమిటంటే ఆమధ్య సినీరంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చిరంజీవి నేతృత్వంలో మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, నారాయణమూర్తి, పోసాని లాంటి కొందరు కలిసిన విషయం తెలిసిందే.

సీన్ కట్ చేస్తే ప్రభాస్ నటించిన రాథేశ్యామ్ సినిమా పెద్ద ఫ్లాప్, చిరంజీవి నటించిన ఆచార్య కూడా బిగ్ డిజాస్టర్, మహేష్ నటించిన సర్కారువారిపాట యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక్కడే ఎల్లోమీడియా జగన్ పై బురదచల్లేస్తోంది. అదేమిటంటే జగన్ ను కలసిన స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని సోషల్ మీడియాలో ఓ మీమ్ చక్కర్లు కొడుతుందని ఎల్లోమీడియా దాన్ని భుజానికెత్తుకుంది.

పైగా లాజికల్ గా చూస్తే ఈ మీమ్ నిజమే అని సర్టిఫికేట్ కూడా ఇచ్చేసింది. సినిమాల గురించి రాస్తు జగన్ను కలసిన హీరోలకు ఫ్లాపులు తప్పలేదు అని ఫైనల్ చేసేసింది. జగన్ తో హీరోల భేటీకి వాళ్ళు నటించిన సినిమాలు ఫ్లాపవ్వటానికి ఏమీ సంబంధంలేదు. సినిమాల్లో దమ్ముంటే అవే హిటవుతాయి. లేకపోతే ఫ్లాపవుతాయి. అంతేకానీ జగన్ను కలసినందుకు వాళ్ళ సినిమాలు ఫ్లాపుకాలేదన్న కనీసం ఇంగితం కూడా ఎల్లోమీడియాకు లేకుండాపోయింది.

మరి ఇదే భేటీలో రాజమౌళి కూడా ఉన్నాడు. మరి ఆయన తీసిన త్రిబుల్ ఆర్ సినిమా ఎలా బంపర్ హిట్ కొట్టింది ? త్రిబుల్ ఆర్ సినిమా బంపర్ హిట్ కు, మిగిలిన సినిమాల ఫ్లాపుకు. జగన్ తో భేటీకి ఎలాంటి సంబంధంలేదు. అయినా సరే జగన్ పై బురదచల్లేయటానికి ఏదో ఒక టాపిక్ దొరికింది కదాని ఎల్లోమీడియా సంబరపడిపోయింది. నిజానికి ఎల్లోమీడియా బాధ చూడాలంటే చాలా కష్టంగా ఉంది. ప్రతిరోజు జగన్ పై బురద చల్లుతుండాలంటే చాలా కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: