ప్రస్తుతం ఏపిలో గడప గడపకి ప్రభుత్వ ప్రతినిదులు వెలుతూ హడావిడి చేస్తున్నారు. స్వయంగా ఏపి సిఎం జగన్ మోహన్ రెడ్డి గడప గడపకు నేతలు వెళ్ళాలి ప్రజల యోగక్షేమాలు నేరుగా తెలుసుకోవాలి. అదే విధంగా అధికారం లోకి వచ్చాక వైసిపి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలును, ప్రవేశ పెట్టిన ప్రతిష్టాత్మక పథకాల గురించి తెలియచేయాలి అంటూ నేతలను సూచించారు. అవగాహన కల్పించకపోతే అందరికీ అన్ని పథకాల గురించి ఎలా తెలుస్తాయి. ప్రజల కొరకు ప్రభుత్వం చేస్తున్న అద్భుతమైన ఎన్నో సంస్కరణల గురించి ఎలా అర్థమవుతుంది అంటున్నారు. దాంతో ప్రస్తుతం ఏపిలో అధికార పార్టీ కార్యకర్తల నుండి మంత్రుల వరకు అందరూ కూడా గడప గడపకు నేతలు వెళ్తున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తమ వంతు కృషి తాము చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి రోజా సెల్వమని కూడా గడప గడపకు వెళ్లడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. శనివారం నాడు మండల పరిధిలోని జగన్నాథపురంలో గడప గడపకు వర్షంలోనూ ఆపకుండా వెళ్లారు. పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా గొడుగు చేత పట్టుకుని ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ సంభాషణలు జరిపారు. వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చాక  గత మూడేళ్ల నుండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని కూడా సదరు లబ్ధిదారులకు అందుతున్నాయా ? లేదా ? అని ప్రజలను అడిగి తెలుసుకోవడమే కాకుండా ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు.  

ఈ విధంగా దాదాపుగా అందరు ప్రజాప్రతినిధులు వెళుతున్నారు. కానీ దీని వెనుక పెద్ద ప్లాన్ ఉందట. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఇబ్బంది లేకుండా ఇప్పుడే ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఇది ఎంత వరకు జగన్ ప్రభుత్వానికి ప్లస్ అవుతుంది అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: