ఆమధ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబునాయుడు ఉగ్రరూపంతో ఊగిపోతే తాను తిరిగి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగుపెడతానని భీషణ ప్రతిజ్ఞచేశారు. ఇది గౌరవసభ కాదని కౌరవసభ అంటు ప్రాస బాగుందని గొప్పగా వాడేశారు. సీన్ కట్ చేస్తే అప్పట్లో చేసిన ప్రతిజ్ఞే ఇపుడు పొత్తుల విషయంలో అడ్డంగా నిలిచింది. రాజకీయంగా చంద్రబాబు జీవితం క్లైమ్యాక్సుకు చేరుకుంటోంది. ప్రస్తుతం 73 ఏళ్ళ వయసున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల నాటికి 75 అవుతుంది.
అంటే వయసుపరంగా వచ్చే ఎన్నికలే చంద్రబాబుకు చివరదికావచ్చు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కాలేకపోతే పార్టీపరంగా, కొడుకు విషయంలో భవిష్యత్తులో చాలా ఇబ్బందులు తప్పవు. ఏపీలో పార్టీ పరిస్ధితి తెలంగాణాలో లాగే అయిపోవటం ఖాయం. కొడుకు భవిష్యత్ బాగుండాలంటే ముందు పార్టీ పరిస్ధితి బాగుండాలి. ఇందుకనే పొత్తుల విషయంలో చంద్రబాబు ఇంతగా వెంపర్లాడుతున్నది. ఒంటరిగా జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టేంత సీన్ లేదని ఎప్పుడో తేలిపోయింది.
పొత్తు పెట్టుకుంటే జనసేనతో మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడే గతంలో తాను చేసిన ప్రతిజ్ఞ ప్రతిబంధకంగా తయారైంది. ఎలాగంటే ముఖ్యమంత్రి కుర్చీమీద చంద్రబాబు ఎలా కన్నేశారో పవన్ కూడా అలాగే కన్నేశారు. అందుకనే పదే పదే రాబోయే ఎన్నికల్లో తాను ఎవరి పల్లకీ మోసేదిలేదని, ఎలాంటి త్యాగాలు చేసేదిలేదని చెబుతున్నది. ముఖ్యమంత్రి కానపుడు చంద్రబాబు కు జనసేనతో పొత్తు అవసరమా ? అని తమ్ముళ్ళు గయ్ మంటున్నారు. ఇదే సమయంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయటానికి తామెందుకు పల్లకి మోయాలంటు జనసేనలోని కీలక నేతలు+కాపుల్లోని కొందరు ప్రముఖులు మండిపోతున్నారు.
వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే అని, ఎన్నికలు ఏకపక్షమే అని చంద్రబాబు చెబుతున్నది సొల్లుకబుర్లే అని అందరికీ తెలుసు. జగన్ ప్రభుత్వం మీద జనాల్లో వ్యతిరేకత ఉందో లేదో తెలీదుకానీ మళ్ళీ చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చే ఉద్దేశ్యంలో జనాలు లేరన్నది మాత్రం వాస్తవం. మరీ పరిస్ధితుల్లో జనసేనతో పొత్తు ఏ పద్దతిలో పెట్టుకోవాలనే విషయం చంద్రబాబులో అయోమయాన్ని పెంచేస్తోంది. అప్పట్లో ముఖ్యమంత్రి పదవి విషయంలో ప్రతిజ్ఞ చేయకుండా ఉండుంటే ఇపుడు ఏదో పద్దతిలో సర్దుకుని పోయేవారేమో. చూద్దాం చివరకు ఏమవుతుందో.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి