‘అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాను’ ఇది పవన్ రీసెంటుగా ఇచ్చిన హామీ. ఉమ్మడి ప్రకాశంజిల్లాలోని పర్చూరులో జరిగిన బహిరంగసభలో పవన్ మాట్లాడుతు జనసేనకు అధికారం ఇవ్వమని జనాలకు విజ్ఞప్తిచేశారు. ఒకసారి చంద్రబాబునాయుడుకు మరోసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో జనసేనకు అవకాశం ఇవ్వమని పవన్ డిగారు. పవన్ లాజిక్కు బాగానే ఉంది తప్పుపట్టాల్సిందేమీలేదు.





అయితే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తనదే అని చెప్పారే కానీ అందుకు తన దగ్గరున్న మార్గమేంటో మాత్రం చెప్పలేదు. ఇప్పటికే 8 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉన్న రాష్ట్రాన్ని పవన్ ఏ విధంగా బయటకు తీసుకొస్తారు ? రాష్ట్రాన్ని కాపాడుతానని చెబితే సరిపోదు అందుకు తన దగ్గరున్న ప్లాన్ ఏమిటో కూడా జనాలకు చెప్పి కన్వీన్స్ చేయాలి. జనాలు కన్వీన్స్ అయినపుడే జనసేనకు అధికారం అప్పగించే విషయాన్ని ఆలోచిస్తారు




.


ఎందుకంటే 2014లో చంద్రబాబు రైతురుణమాఫీ, డ్రాక్రా రుణాల మాఫీ, కాపులను బీసీల్లో చేర్చటం లాంటి అనేక ఆచరణసాధ్యంకాని హామీలిచ్చారు. అప్పట్లో వాటిని నమ్మిన జనాలు ఓట్లేసి గెలిపించిన తర్వాత చంద్రబాబు ఏమిచేశారు ? నమ్మి ఓట్లేసిన జనాలను నట్టేటముంచారు. హామీలను ఏ విధంగా తీరుస్తారని అడిగిన వాళ్ళందరికీ తమ లెక్కలు తమకున్నాయని, ఇఫుడే చెబితే వాటిని మిగిలిన పార్టీలు కాపీ కొట్టేస్తాయని చెప్పారు. అయితే ఆ తర్వాతే తెలిసింది చంద్రబాబు అండ్ కో చెప్పిందంతా సొల్లు కతలేని.





తర్వాత జగన్ పాదయాత్ర సందర్భంగా నవరత్నాల హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలను అమలు చేస్తున్నారు. అంటే జనాలు చంద్రబాబును చూశారు ఇపుడు జగన్నూ చూస్తున్నారు. ఇందుకనే తనను జనాలు నమ్మాలంటే అప్పుల భారంనుండి ఏపీని ఏ విధంగా బయటపడేస్తారు ? అందుకు తనదగ్గరున్న వ్యూహాలేమిటి ? అనేవి చెప్పాల్సిన బాధ్యత పవన్ మీదే ఉంది. అలాకాకుండా ముందు అధికారం అప్పగించండి తర్వాత తాను ఏమిచేస్తానో చూడండి అంటే జనాలు పిచ్చోళ్ళు కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: