సాదారణంగా పెళ్ళి అంటే డిజె ఉండటం, చూడగానే అదిరిపోయేలా మండ పాన్ని రెడీ చెయ్యడం,అంతకు మించి వధూవరులు రెడీ అవ్వడం మనం చూసే ఉంటాము.కానీ ఇప్పుడు అలాంటి వాటికి స్వస్తి చెప్పే టైం వచ్చేసింది.. పెళ్ళిలో డిజె, డ్యాన్స్ లు భారీ అలంకరణలు చేస్తె కఠిన చర్యలు తప్పవని అధికారులు అంటున్నారు. అంతేకాదు పెళ్లి కొడుకు చూడటానికి స్మార్ట్ గా, అందంగా ఉండాలి..అంటే క్లీన్ సేవ్ చేసుకోని ఉండాలని అంటున్నారు.ఏదైనా లిమిట్ గా ఉండాలని అంటున్నారు. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...


తమ తాహతుకు మించి ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా వారు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో నే రాజస్థాన్‌ పాలిలో ని రెండు సామాజికవర్గాలు ఈ హంగూఆర్భాటాలకు స్వస్తి పలకాలని నిశ్చయించుకున్నాయి. వివాహాలను చాలా తక్కువ ఖర్చుతో చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారీగా అలంకరణ, డీజే చప్పుళ్లు, బాణాసంచా లేకుండా.. గుర్రంపై వరుడి ఊరేగింపు లేకుండా వివాహాలు జరుపుకోవాలని కుమావత్, జాట్ సామాజిక వర్గాల నేతలు నిర్ణయించాయి.


వధూవరులకు ఇచ్చే నగలు, నగదు, దుస్తుల లాంటి బహుమతులపై కూడా పరిమితులు విధించేందుకు సిద్ధమయ్యాయి. వరుడితో పాటు, వివాహానికి హాజరయ్యే వారికి గడ్డం ఉండకూడదని స్పష్టం చేశారు. వివాహ వేడుకను దైవ కార్యంగా, వరుడ్ని రాజుగా భావించే పెళ్లి లో వరుడికి గడ్డం ఉండకూడదని, పెళ్లికి వచ్చేవారు కూడా గడ్డాలతో రాకూడదని కుమావత్‌ వర్గం నేత లక్ష్మీ నారాయణ్‌ తిలక్‌ వెల్లడించారు. అలంకారాలు, మ్యూజిక్‌, ఇతర పనుల కు డబ్బు ను వృథా చేయడం అనవసరం అని అన్నారు. సమాజం లో సమానత్వం, వివాహ కార్యక్రమాలలో ఏకరూపత తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నియమాలను తీసుకొచ్చాం' అని అంటున్నారు. ఎవరైనా ఈ చర్యలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు కూడా అంటున్నారు. అది అసలు మ్యాటర్..

మరింత సమాచారం తెలుసుకోండి: