భారత రక్షణ రంగాన్ని పటిష్టవంతం చేసుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది . ఈ క్రమంలోనే భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డి ఆర్ డి ఓ శాస్త్రవేత్తలకు భారీగా నిధులు కేటాయిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొంత కాలం నుంచి వరుసగా క్షిపణుల ప్రయోగాలు చేసి శాస్త్రవేత్తలు వాటికి పరీక్షలు నిర్వహించి విజయవంతం కూడా అవుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే కేవలం అగ్ర దేశాలకు మాత్రమే సాధ్యమైన ఆయుధ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది ఇండియా. ఇక ఎన్నో దేశాలకు మిస్సైల్స్  విక్రయించడం లాంటి కూడా చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే.


 అంతేకాదు అగ్ర దేశాలకు పోటీని ఇచ్చే విధంగా అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను తయారు చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం ఎన్నో రకాల పరిశోధనలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికీ ఎంతో పవర్ఫుల్ మిస్సైల్స్ తయారుచేసిన డి ఆర్ డి ఓ.. ఇక ఇప్పుడు మరో సరికొత్త అద్భుతమైన ఆవిష్కరణ కు శ్రీకారం చుట్టింది అని తెలుస్తోంది. ఇప్పటివరకు కేవలం పైలెట్ తో కూడిన విమానాన్ని మాత్రమే యుద్ధ రంగంలో ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు మాత్రం మానవరహిత విమానాన్ని తయారుచేసిన  డిఆర్డిఓ శాస్త్రవేత్తలు ప్రయోగం నిర్వహించి విజయవంతమయ్యారు.


 కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో ఇక మానవరహిత విమానానికి పరీక్షలు చేపట్టారు అనేది తెలుస్తుంది. అయితే పైలెట్ లేకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో గాల్లోకి  దూసుకు పోయిన విమానం ల్యాండింగ్ వరకు కూడా అన్ని పనులు విజయవంతంగా జరిగాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ విమానం పూర్తిగా సెల్ఫ్ కంట్రోల్ డ్రైవింగ్ తోనే పని చేస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయంపై స్పందించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. మానవ రహిత విమానాలు అభివృద్ధిలో ఇది అద్భుతం  విజయం అంటూ ప్రశంసలు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: