బస్తీమే సవాలంటారు..ఎవరికీ భయపడేదిలేదంటారు..ఎవరొచ్చినా సవాలంటారు. తీరాచూస్తే దాదాపు రెండునెలలుగా అడ్రస్ లేకుండాపోయారు. ఇదంతా ఎవరిగురించో ఈపాటికే తెలిసిపోయుంటుంది. అవును నారా లోకేష్ గురించే. ఇంతకీ విషయం ఏమిటంటే దాదాపు రెండునెలల క్రితం పదవతరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులు, వాళ్ళ తల్లిదండ్రులతో లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగు బిజీగా ఉన్న సమయంలో హఠాత్తుగా లోకేష్ మీటింగ్ ను ముగించుకుని వెళ్ళిపోయారు.

జూమ్ మీటింగును లోకేష్ ఎందుకు అర్ధాంతరంగా ముగించేశారంటే జూమ్ లోకి కొడాలినాని, వల్లభనేని వంశీ ప్రత్యక్షమయ్యారు కాబట్టే. నిజానికి ఆరోజు లోకేష్ జూమ్ మీటింగ్ పెట్టింది ఫెయిలైన విద్యార్ధులను, వాళ్ళ తల్లిదండ్రులకు మనోస్ధైర్యం కల్పించటంకోసం కాదు. అచ్చంగా వాళ్ళందరినీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడంకోసమే. ఆ మీటింగులో జరుగుతున్నది కూడా అదే. ఎప్పుడైతే జూమ్ మీటింగులోకి కొడాలి, వంశీలు ప్రత్యక్షమయ్యారో ముందు లోకేష్ కు దిమ్మతిరిగింది. తర్వాత మేల్కొని ఏమిచేయాలో అర్ధంకాక మీటింగును ముగించేశారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే కొడాలి, వంశీ దెబ్బకు లోకేష్ మళ్ళీ ఇప్పటివరకు జూమ్ మీటింగ్ నిర్వహించలేదు. మామూలుగా జనాల్లో తిరగటంకన్నా సోషల్ మీడియాలో ఉండటమే లోకేష్ కు ఇష్టం. అయినదానికి కానిదానికి  ట్విట్టర్లో విపరీతంగా రెచ్చిపోతుంటారు. ట్విట్టర్లో కనబడే కామెంట్లన్నీ లోకేష్ పేరుతో ప్రత్యేకంగా పెద్ద టీమే పెడుతుంటుందట. ఏదేమైనా కొంతకాలంగా లోకేష్ జూమ్ మీటింగు నిర్వహించలేదన్నది వాస్తవం.

ఆరోజు జరిగిన మీటింగ్ కూడా పలానా వాళ్ళే పాల్గొనాలని టీడీపీ కానీ లోకేష్ కానీ ఏమి చెప్పలేదు. లోకేష్ నిర్వహించబోయే జూమ్ మీటింగు ఓపెన్ టు ఆల్ అన్నట్లుగా మీటింగులో పాల్గొనాల్సిన లింకును ప్రకటించారు. దాని ఆధారంగా కొడాలి, వంశీల మేనళ్ళు కూడా మీటింగులోకి ఎంటరయ్యారు. వాళ్ళ స్ధానంలో ఎంఎల్ఏలిద్దరు ప్రత్యక్షమయ్యారు. దీన్ని లోకేష్ ఏమాత్రం ఊహించలేదు. అందుకనే వాళ్ళు కనబడగానే అర్ధాంతరంగా మాయమైపోయారు. మళ్ళీ ఇప్పటివరకు జూమ్ మీటింగ్ నిర్వహించలేదంటేనే కొడాలి, వంశీలు లోకేష్ ను ఎంతగా భయపెట్టారో అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: