జాతీయపార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిపోవాలన్నది కేసీయార్ ఆలోచన, ఆశ. జాతీయపార్టీ పెట్టడం ఈజీనే కానీ మిగిలిన రాష్ట్రాల్లో ఆ పార్టీని విస్తరించటం, ఇతర ప్రాంతీయపార్టీలతో పొత్తులు పెట్టుకోవటం, సక్సెస్ కొట్టడం చాలా కష్టం. కాంగ్రెస్, బీజేపీని వదిలేస్తే జాతీయపార్టీలుగా చెలామణి అవుతున్న పార్టీలు చాలానే ఉన్నాయి. నిజంగానే అవన్నీ జాతీయపార్టీలేనా ? అంటే కాదనే చెప్పాలి.
సమాజ్ వాదీపార్టీ, ఎన్సీపీ, బీఎస్సీ, ఎంఐఎం, శివసేన, జనతాదళ్ లాంటి అనేక పార్టీలు తమను తాము జాతీయపార్టీలుగానే చెప్పుకుంటాయి. కానీ అవి బేసయిన రాష్ట్రాల్లో తప్ప ఇతరరాష్ట్రాల్లో వాటికెంత సీనుందో అందరికీ తెలుసు. ఆమ్ ఆద్మీపార్టీ ఒకటే జాతీయపార్టీగా ఎమర్జవుతోంది. ఎందుకంటే ఇంతకాలం ఢిల్లీకి మాత్రమే పరిమితమైన ఆప్ ఇపుడు పంజాబ్ లో కూడా అధికారంలోకి వచ్చింది. రెండురాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ఘనత ఆప్ కు తప్ప మరే పార్టీకి లేదు.
సో ఇలాంటి నేపధ్యంలో కేసీయార్ కూడా టీఆర్ఎస్ ను జాతీయపార్టీగా మార్చాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. దసరాకల్లా జాతీయపార్టీగా ప్రకటించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సరే మిగిలిన రాష్ట్రాల్లో కేసీయార్ తో ఎవరు చేతులు కలుపుతారు ? ఎవరు దూరంగా ఉంటారనే విషయాలను వదిలేద్దాం. అసలు ఏపీలో కేసీయార్ తో చేతులు కలిపేదెవరు ? అన్నదే కీలకమైన ప్రశ్న.
ఇప్పటికైతే ఏపీలో కేసీయార్ తో చేతులు కలిపే వాళ్ళు ఎవరు లేరనే చెప్పాలి. ఎందుకంటే వైసీపీ అయినా టీడీపీ అయినా ఎన్డీయే ప్రభుత్వంతోనే ఉన్నాయి. వైసీపీకి బీజేపీతో పొత్తులేకపోయినా చంద్రబాబునాయుడు మాత్రం పొత్తుకోసం తెగ ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇటు జగన్ అటు చంద్రబాబు ఎవరూ కేసీయార్ తో చేతులు కలపరనే చెప్పాలి. ఎలాగూ బీజేపీపైనే యుద్ధం ప్రకటించారు కాబట్టి ఆ పార్టీ కలవదు. ఇక మిగిలింది కాంగ్రెస్, వామపక్షాలు మాత్రమే కాంగ్రెస్ ను పక్కకు నెట్టేస్తే బహుశా వామపక్షాలు కేసీయార్ తో చేతులు కలిపే అవకాశముంది. మొత్తానికి ఏపీలో కచ్చితంగా కేసీయార్ తో చేతులు కలిపే పార్టీలేదనే చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి