ప్రజల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల కొత్త స్కీమ్ లను అందిస్తున్నాయి.ఇప్పటికే పలు రకాల స్కీమ్ లు అందుబాటులోకి వచ్చాయి.వాటి వల్ల ప్రజలు ఆర్దికంగా అభివృద్ధి చెందుతున్నారు..మోడీ తీసుకోచ్చిన పథకాలలో కార్మికుల ఉన్నతి కోసం తీసుకోచ్చిన పథకం ఈ-శ్రామ్.. ఈ పథకం ద్వారా కార్మికులకు మంచి లాభాలు ఉన్న సంగతి తెలిసిందే..

కరోనా తర్వాత కార్మికుల వలసల సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీనికింద ప్రభుత్వం కార్మికులకు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రతి కార్డుదారునికి రూ.2 లక్షల బీమా అందిస్తోంది. దీంతో పాటు ఈ కార్డు హోల్డర్లు కార్మిక మంత్రిత్వ శాఖ పథకాల ప్రయోజనాలను కూడా పొందుతున్నారు..
వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు, రోజువారీ కూలీలు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు, రిక్షా పుల్లర్లు, భవన నిర్మాణ కార్మికులు ఈ-శ్రమ్ కార్డ్ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి వయస్సు 16 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. మీరు ఈ పథకం కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..ప్రస్తుతం ఈ పథకం ద్వారా 28 కోట్ల మంది లబ్ది పొందుతున్నారు.

దాదాపు 38 కోట్ల మంది కార్మికులను ఈ పథకంతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సంఘటిత రంగంలో పనిచేసే వారు అలాగే EPFO ఖాతాదారులుగా ఉన్నవారు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోలేరు. దీంతో పాటు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకం కోసం దరఖాస్తు చేయలేరు. అంతేకాకుండా NPS,EPFO లబ్దిదారులు ఈ పథకం ప్రయోజనాన్ని పొందడం కుదరదు..

ఇక ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చుద్దాము..

ముందుగా eshram.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
తర్వాత eSHRAMలో రిజిస్టర్ లింక్‌ని ఓపెన్‌ చేయాలి.
 తర్వాత మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేసి క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. తర్వాత OTPని ఎంటర్‌ చేయాలి.
అన్ని వివరాలను నింపిన తర్వాత ఫారమ్‌ను సమర్పించాలి.
 ఈ-శ్రమ్ యోజన కోసం ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, మొబైల్ నంబర్ అవసరమవుతాయి...ఇదే ఈ-శ్రామ్ కార్డ్ గురించి పూర్తి వివరాలు..


మరింత సమాచారం తెలుసుకోండి: