బ్లడ్ ఈజ్ థిక్కర్ దేన్ వాటర్ అని పెద్దలు ఊరికే అనలేదు. ఒక సినిమా ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి. ఎన్నికల సమయానికి జనసేన అధినేత, తమ్ముడైన పవన్ కల్యాణ్ కు మద్దతుగా చిరంజీవి రంగంలోకి ప్రవేశించటం దాదాపు ఖాయమైపోయింది. పార్టీ తరపున ప్రచారం మాత్రమే చేస్తారా ? లేకపోతే ఇంకా యాక్టివ్ పార్ట్ తీసుకుంటారా అన్నది అప్పటి పరిస్ధితులపైన ఆధారపడుంటుంది. ప్రజల మద్దతుంటే పవన్ రాష్ట్రాన్ని ఏలే అవకాశం ఉందన్నారు. జనసేనకు తాను భవిష్యత్తులో మద్దతు కూడా ఇవ్వచ్చేమో అని కూడా చెప్పారు. తమ్ముడికి హెల్పవుతుందనే తాను రాజకీయాల్లో నుండి తప్పుకున్నట్లు చెప్పారు.

రాజకీయంగా తామిద్దరం చెరోవైపు ఉంటే బాగుండదన్న ఉద్దేశ్యంతోనే తాను సైడ్ అయిపోయినట్లు చెప్పారు. తమ్ముడి నిబద్ధత, నిజాయితి తనకు బాగా తెలుసన్నారు. తన తమ్ముడు రాష్ట్రాన్ని ఏలేరోజు రావాలని తాను కోరుకుంటున్నట్లు కూడా చిరంజీవి చెప్పారు. తప్పులేదు ఎంతైనా తమ్ముడు కాబట్టి ఏ రంగంలో ఉన్నా ఉన్నతస్ధాయికి చేరుకోవాలని కోరుకోవటంలో మెగాస్టార్ ను తప్పుపట్టాల్సిన అవసరమే లేదు.

కాకపోతే పవన్ లో నిబద్ధత, నిజాయితి ఉందని చిరంజీవి చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. పవన్ లాంటి నిబద్ధత ఉన్న నాయకుడు మనకు కావాలని చెప్పటమే విచిత్రంగా ఉంది. పవన్లోని నిబద్ధత చిరంజీవి ఏమి చూశారు ? ఏ విషయంలో నిబద్ధత ఉంది తన తమ్ముడిలో. ప్రశ్నించటానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కేవలం జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ప్రశ్నిస్తున్నారు. జగన్ను ప్రశ్నించటంలో పవన్ నిబద్ధత చిరంజీవికి నచ్చిందా ?

రాష్ట్రప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్న నరేంద్రమోడీ సర్కార్ ను ఏరోజైనా పవన్ నిలదీశారా ? టీడీపీ హయాంలో ఎన్ని అరాచకాలు జరిగినా ఆరోజుల్లో పవన్ ఎందుకని నోరిప్పలేదు ? అదేనా తమ్ముడిలో చిరంజీవి చూసిన నిబద్ధత, నిజాయితి ? చెప్పాల్సిందంతా చెప్పేసి భవిష్యత్తులో తాను తమ్ముడికి మద్దతిస్తానో లేదో అని అనటం ఎందుకు ? జనసేనకు చిరంజీవి మద్దతిస్తే కాదనే వాళ్ళెవరు ? చిరంజీవి మద్దతు వల్ల జనసేనకు కొంచెం మేలు జరగచ్చేమో కానీ అధికారంలోకి వచ్చేస్తుందనైతే చెప్పేందుకు లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: