పాపం తమ బండారం బయటపడుతుందని తమ్ముళ్ళు అనుకున్నట్లులేరు. హైకోర్టు ఆదేశాల వల్ల మొదలైన పాదయాత్ర చివరకు అదే హైకోర్టు ఆదేశాలతో ఆగిపోతుందని తమ్ముళ్ళు ఏమాత్రం ఊహించుండరు. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండుతో పాదయాత్ర చేయాలని అమరావతి జేఏసీ నిర్ణయించింది. అయితే అమరావతి జేఏసీ అంతా మోసమని, అందులో రైతులకన్నా రియల్ ఎస్టేట్, వ్యాపారులు, బ్రోకర్లు, బయటవ్యక్తులే ఎక్కువమంది ఉన్నట్లు మొదటినుండి వైసీపీ నేతలు ఆరోపిస్తునే ఉన్నారు.

పాదయాత్రకు పోలీసులు అభ్యంతరం చెబితే జేఏసీ కోర్టుకెళ్ళి ఆదేశాలు తెచ్చుకున్నది. చివరకు కోర్టు ఆదేశాల కారణంగా పోలీసులు కొంత బందోబస్తు ఏర్పాటుచేసి పాదయాత్రకు ఓకేచేశారు. పాదయాత్ర సమయంలో కోర్టు విధించిన కొన్నిఆంక్షలను జేఏసీ ఉల్లంఘించినా పోలీసులు చూసీచూడనట్లు వదిలేశారు. దాంతో పాదయాత్ర గోదావరి జిల్లాల్లోకి ప్రవేశించింది. అక్కడి నుండి గొడవలు మొదలై చివరకు రామచంద్రాపురం చేరుకునేసరికి పెద్దదైంది.

సరిగ్గా రామచంద్రాపురం దగ్గర పోలీసులు కోర్టు ఆంక్షలను అమలు చేయాలని అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం అందరి గుర్తింపుకార్డులు తనిఖీచేశారు. దాంతో పాదయాత్రలో ఉన్న చాలామంది పరారైపోయారు. కారణం ఏమిటని ఆరాతీస్తే యాత్రలో పాల్గొంటున్న వారిలో చాలామంది రైతులు కాదని అసలు అమరావతి ప్రాంతంతో సంబంధమే లేదని తేలిపోయింది. యాత్రలో పాల్గొంటున్న వారు 75 మంది మాత్రమే గుర్తింపుకార్డులు చూపితే మిగిలిన వారు పారిపోయారు. అంటే ఈ పాదయాత్ర ఎంత బోగస్సో అర్ధమైపోతోంది.

ఇపుడు సమస్య ఏమిటంటే యాత్ర తాత్కాలికంగా ఆగిపోయిందా ? లేకపోతే ఇక జరగనే జరగదా ? అనే డౌట్లు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే పాదయాత్రలోని డొల్లతనం అందరికీ తెలిసిపోయింది. ఈ యాత్ర మొత్తం టీడీపీ స్పాన్సర్డ్ యాత్రని లోకానికి తెలిసిపోయింది. దాంతో అమరావతి జేఏసీ పాదయాత్రను సమర్ధించుకోలేక నానా అవస్తలు పడుతోంది. కోర్టు ఆదేశాల అమలువల్ల అసలువిషయం బయటపడటంతో ఎల్లోబ్యాచ్ కి ఏమిమాట్లాడాలో కూడా దిక్కుతోచటంలేదు. అందుకనే యావత్ ఎల్లోబ్యాచ్ నోరెత్తలేక మౌనంగా ఉండిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: