ఖమ్మం బహిరంగసభ నిర్వహణతో కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ గ్రూపును చంద్రబాబునాయుడు అయోమయంలో పడేసినట్లే ఉన్నారు. టీడీపీ నుండి ఇతరపార్టీల్లోకి వెళ్ళిన నేతలందరినీ ఘర్ వాపసీ లాగ తిరిగి పార్టీలోకి రావాలని బహిరంగసభలో పిలుపిచ్చారు. వస్తారా లేదా టీడీపీలో ఏముందని వస్తారు అనే ప్రశ్నలకు భవిష్యత్తే సమాధానం చెప్పాలి. చంద్రబాబు అయితే పిలుపిచ్చారు కాబట్టి ఎంతమంది రెస్పాండ్ అవుతారో చూడాలి. అసలు తెలంగాణాలో పార్టీని పాడుపెట్టేసిందే చంద్రబాబు.
ఓటుకునోటు కేసు దెబ్బకు అరెస్టుకు భయపడి అర్ధాంతరంగా హైదరాబాద్ ను వదిలేసి విజయవాడ పారిపోయింది ఎవరు ? అప్పట్లో పార్టీని, నేతలను వదిలిపెట్టి పారిపోయిన చంద్రబాబు ఇపుడు మళ్ళీ తిరిగిరమ్మంటే వస్తారా ? ఎవరెవరో ఏవో పార్టీల్లో సర్దుకున్నారు. ఇందులో భాగంగానే రేవంత్ తో పాటు కొందరు కాంగ్రెస్ లో చేరారు. అయితే అధిష్టానం నియమించిన రెండు కమిటీల్లో ఎక్కువమంది టీడీపీ వలసనేతలే ఉన్నారన్న పాయింట్ మీద చాలామంది సీనియర్లు గోలచేస్తున్నారు.
సీనియర్లు సమావేశమై రేవంత్ నే బహిష్కరించాలని నిర్ణయించారు. దాంతో లాభంలేదని అనుకుని రేవంత్ వర్గమంతా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే రేవంత్ తో పాటు తన వర్గంనేతలంతా బాగా సఫొకేషన్ ఫీలవుతున్నారు. రేవంత్ ను ఏ పనీ స్వతంత్రంగా చేయనివ్వరు, రమ్మంటే కలిసిరారు. రేవంత్ కు సీనియర్లలో చాలామంది సహాయనిరాకరణ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావటం వీళ్ళకు ఇష్టం లేనట్లుంది.
సరే తాజా పరిస్ధితుల్లో కాంగ్రెస్ లో ఉండి సఫొకేషన్ ఫీలయ్యేబదులు మళ్ళీ టీడీపీలోకి తిరిగి వెళిపోతే ఎలాగుంటుందని రేవంత్ వర్గంలోని నేతలెవరైనా ఆలోచించే అవకాశమంది. ఈ నేపధ్యంలోనే రేవంత్ వర్గంలో అయోమయం మొదలైనట్లుంది. ఎందుకంటే కాంగ్రెస్ లో సఫొకేషన్ ఫీలవుతున్నారు, చంద్రబాబు మీద నమ్మకంలేదు. రేపేదైనా సమస్య వస్తే మళ్ళీ అందరినీ వదిలేసి పారిపోడని గ్యారెంటీలేదు. కేసీయార్ అధికారంలో ఉన్నంతవరకు చంద్రబాబు హైదరాబాద్ లో ప్రశాంతంగా ఉండలేరన్నది వాస్తవం. దీంతోనే రేవంత్ వర్గంలో అయోమయం పెరిగిపోతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి