
ఉద్దేశపూర్వకంగా నోట్లను ఏటీఎంలో ఉంచాలని గానీ లేదా ఉంచొద్దని గానీ కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు సూచించలేదని ఆమె వెల్లడించారు. నోట్లను ఏటీఎంలో ఉంచాలా ఉంచొద్దా అనే విషయం సంబంధిత బ్యాంకుల చేతుల్లోనే ఉంటుందని ఆమె వివరించారు. కాలాన్ని, ప్రాంతాలలోని అవసరాలను బట్టి బ్యాంకులో సొంతంగా ఏటీఎంలో ఉంచాల్సిన నోట్ల విషయంలో నిర్ణయాలు తీసుకుంటాయని కూడా ఆమె తెలిపారు.
ఇక 2017 నాటికి రూ.9.512 లక్షల కోట్ల విలువైన రూ.500, రూ.2,000 నోట్లు ఇండియాలో సర్కులేషన్లో ఉన్నాయని.. 2022 నాటికి వాటి విలువ 27 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్ర ప్రభుత్వానికి 2023, మార్చి 31 నాటికి రూ.155.8 లక్షల కోట్ల అప్పు ఉంటుందని అంచనా వేశారు.
ఇదిలా ఉండగా 2019-20, 2020-21,, 2021-22 మధ్యకాలంలో కొత్త రూ.2,000 డినామినేషన్ కరెన్సీ నోట్లను ముద్రించలేదని రైట్-టు-హక్కు వెల్లడించింది. ఆ తర్వాత ఏటీఎంలలో 2000 నోట్లు కనిపించకపోవడంతో, ఈ నోటును ప్రభుత్వం చలామణి నుంచి తీసేసే అవకాశం ఉందని ఊహగానాలు వెల్లువెత్తాయి. కాగా దీనిలో నిజం లేదని, ఏటీఎంలో బ్యాంకులో 2000 నోట్లను ఉంచడం లేదని తేలింది.