జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రభుత్వం చాలా పెద్ద షాకిచ్చింది. బహుశా ప్రభుత్వం తన విషయంలో ఈ విధంగా యాక్ట్ చేస్తుందని పవన్ కూడా ఊహించుండరు. ప్రభుత్వంతో పాటు వాలంటీర్లపై నిరాధార ఆరోపణలు చేసినందకు పవన్ పై పరువునష్టం దావా వేయాలని డిసైడ్ చేసింది. ఇందుకు అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ను ప్రభుత్వం ఆదేశించింది.




ఈనెల 9వ తేదీన వారాహియాత్రలో ఏలూరు సభలో పవన్ మాట్లాడుతు రాష్ట్రంలో జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ కు వాలంటీర్లే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో 30 వేల మంది ఆడవాళ్ళు కనిపించటంలేదని ఫిర్యాదులు వస్తే అందులో  14 మంది జాడ మాత్రమే తెలిసిందన్నారు. అంటే పవన్ లెక్క ప్రకారం 16 వేలమంది ఆడవాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ అయినట్లు. 30 వేల మంది ఆడవాళ్ళు మిస్సయారని ఒకసారి, హ్యూమన్ ట్రాఫికింగ్ అయ్యారని మరోసారి పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడారు.




ఇంటింటికి తిరుగుతున్న వాలంటీర్లు ఇళ్ళల్లోని ఒంటరి ఆడవాళ్ళ వివరాలు సేకరించి సంఘవిద్రోహులకు ఇస్తున్నట్లు ఆరోపించారు. పైగా హ్యూమన్ ట్రాఫికింగ్ కు వైసీపీలోని పెద్దల హస్తముందన్నారు. ఇన్ని వేలమంది హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతున్నట్లు పవన్ కు ఎలా తెలిసిందంటే  కేంద్ర నిఘావర్గాలు చెప్పాయట. ఏపీలో జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి నిఘావర్గాలు తనకు చెప్పి జనాలను అప్రమత్తం చేయమని చెప్పాయట.




వేలమంది ఆడవాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగుకు గురవ్వటం ఏమిటో ? అందుకు వాలంటీర్లు కారణం అవటం ఏమిటి ? ఆ విషయాన్ని కేంద్ర నిఘావర్గాలు పవన్ చెవిలో చెప్పటం ఏమిటో జనాలకు ఎంత ఆలోచించినా అర్ధంకావటంలేదు. జగన్ ప్రభుత్వం ఎలాంటి ఆరోపణలు చేసినా పర్వాలేదు ఏమీకాదన్న ధైర్యంతోనే పవన్ నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. పవన్ ఆరోపణలను ఎల్లోమీడియా ప్రముఖంగా ప్రచురించింది. పవన్ ఆరోపణలకు వ్యతిరేకంగా వాలంటీర్లు నాలుగురోజులు ఆందోళన చేశారు. అయితే పవన్ తన ఆరోపణలను పదేపదే రిపీట్ చేశారు. దాంతో ప్రభుత్వం స్పందించి పవన్ పై ప్రాసిక్యూషన్ కు ఆదేశాలిచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: