ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల కౌంటింగ్ మొదలవుతాయనగా శుక్రవారం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. అదేమిటంటే శుక్రవారం రాత్రి నుండి ఒక్కసారిగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర సెక్యూరిటి బాగా పెరిగిపోయింది. మామూలుగా ఎంపీ హోదాలో రేవంత్ కు  కొంత సెక్యూరిటి ఉంటుంది. ఇపుడు పీసీసీ అధ్యక్షుడు కూడా కావటంతో ఇంకొంత సెక్యూరిటి ఉంటుందంతే. అయితే శుక్రవారం రాత్రి ఇంటి దగ్గర హెవీ సెక్యూరిటి పెరిగిపోయింది.





శుక్రవారం సాయంత్రంవరకు మామూలుగానే ఉన్న సెక్యూరిటి రాత్రికి రాత్రి ఎందుకు హెవీగా పెరిగిపోయిందో అర్ధంకావటంలేదు. పోలింగ్ ముగిసిన తర్వాత అంటే సాయంత్రం 5.30 గంటల నుండి ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. అందులో మెజారిటి సంస్ధలు అధికారంలోకి వచ్చేది కాంగ్రెసే అని తేల్చేశాయి. గురువారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రిలీజైనా రేవంత్ ఇంటి దగ్గర సెక్యూరిటి మామూలుగానే ఉందంతే. శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా సెక్యూరిటిలో ఎలాంటి మార్పులేదు.





అలాంటిది రాత్రయ్యేసరికి హెవీ సెక్యూరిటి ఎందుకు వచ్చేసిందో అర్ధంకావటంలేదు. జరుగుతున్న పరిణామాలనుబట్టి అధికారంలోకి రాబోయేది కాంగ్రెసేనని, ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారా అనే అనుమానాలు జనాల్లో పెరిగిపోతున్నాయి. మామూలుగా అయితే ఎగ్జిట్ పోల్స్ ను ప్రభుత్వం లేదా పోలీసు శాఖ పట్టించుకోదు. ఎందుకంటే ఎగ్జిల్ పోల్స్ అన్నది మీడియాకు లేదా సర్వే సంస్ధలకు సంబందించిన అనధికార కార్యక్రమం మాత్రమే. దీన్ని నమ్మేజనాలు నమ్ముతారు లేనివాళ్ళు లేదంతే.





దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అందుకనే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎగ్జిట్ పోల్స్ ను మిగిలిన వాళ్ళలాగే ఒక అంచనాగా మాత్రమే చూస్తారు. అలాంటిది ఒక్కసారిగా ఇంటి దగ్గర భారీ భద్రత పెరిగిపోయిందంటేనే రేవంతే ముఖ్యమంత్రనే సంకేతాలు జనాల్లోకి వెళ్ళిపోయాయి. ఇదే సమయంలో శుక్రవారం రాత్రి ప్రగతి భవన్లో కేసీయార్ స్టాఫ్ మొత్తానికి బట్టలు, విలువైన కానుకలు అందించినట్లు సమాచారం. ఈ రెండు డెవలప్మెంట్లను చూసిన తర్వాత జనాలందరికీ ఏమనిపిస్తుంది ?




మరింత సమాచారం తెలుసుకోండి: