ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా పార్లమెంట్ ఎన్నికల హడావిడినే కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు విమర్శలు ప్రతి విమర్శలతో బిజీగా ఉన్న పార్టీలన్నీ కూడా ఇక ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు గుర్రాలను రంగంలోకి దింపడంలో బిజీబిజీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రత్యర్ధులను మించి ఓటరు మహాశయులను ఆకట్టుకునేలా ఇక పావులు కదుపుతూ ఉన్నాయి అన్ని పార్టీలు. దీంతో ఎక్కడ చూసినా కూడా ఇలాఎన్నికల హడావిడినే కనిపిస్తూ ఉంది.


 అయితే తెలంగాణలోనూ ఈ హడావిడి కాస్త ఎక్కువగా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ మరోసారి పార్లమెంట్ ఎలక్షన్లోనూ గెలిచి నిలవాలని అనుకుంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష హోదాని దక్కించుకున్న బిఆర్ఎస్ కనీసం పార్లమెంటు ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని అనుకుంటుంది  ఈ క్రమంలోనే ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక హైదరాబాద్లో బిఆర్ఎస్ అభ్యర్థిని నిలబెడుతుందా లేదా అనే విషయంపై ఆసక్తి నెలకొంది.


 ఎందుకంటే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఎంఐఎం పార్టీ కంచుకోటగా పిలుచుకుంటూ ఉంటారు. ఇక ఎప్పుడు ఎలక్షన్స్ జరిగిన అక్కడి నుంచి ఎంఐఎం పార్టీ నుంచి నిలబడిన అభ్యర్థి విజయం సాధించడం చూస్తూ ఉంటాం. కాగా బీఆర్ఎస్ కి ఎంఐఎం కి మంచి దోస్తానా కూడా ఉంది. దీంతో బిఆర్ఎస్ అక్కడ అభ్యర్థిని నిలబెడుతుందా లేదా అనే చర్చ జరగగా.. ఇటీవల ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చాడు. కెసిఆర్, ఎంఐఎం పార్టీతో స్నేహం ఉంది తప్ప.. ఎన్నికల్లో పోటీపరంగా ఎలాంటి పొత్తు లేదు అన్న విషయాన్ని హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో గడ్డం శ్రీనివాస్ యాదవ్ను నిలబెట్టి క్లారిటీ ఇచ్చేశాడు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్. గత కొంతకాలం నుంచి బిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగానే వ్యవహరిస్తున్న గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఇక ఇప్పుడు బరిలో నిలిచి గెలుస్తాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: