తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ మిగతా పార్టీలన్నీటిని కూడా గడ్డి పోచల్లా భావించేవాడన్నది అందరూ అనుకున్న మాట. ఆ పార్టీతో మాకు పోటీ ఏంటి మేమెక్కడ వాళ్లేక్కడ.. అనే రేంజ్ లో విరుచుకుపడేవాడు. కానీ ఎప్పుడు బండ్లు ఓడలు అవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి అన్నది ఊహించలేము. అంతా ఓటర్ల చేతిలో ఉంటుంది. తెలంగాణ ఓటర్లందరూ మూడోసారి బీఆర్ఎస్ కు అధికారం కట్ట పెట్టాలని అనుకోలేదు. కాంగ్రెస్ కి ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పజెప్పారు.



 ఇంకేముంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టిందో లేదో ఇక పొలిటికల్ రివెంజ్ మొదలైంది. ఒకప్పుడు ఉన్న అతి తక్కువ మంది ఎమ్మెల్యేల్లో దాదాపు పది మందిని ఇక పార్టీలో చేర్చుకొని.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నామరూపాల్లేకుండా చేయాలని అనుకున్నాడు కేసీఆర్. పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాడు. ఇక ఇప్పుడు పొలిటికల్ రివెంజ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకుమించి చేసి చూపిస్తున్నాడు. దీంతో గులాబీ దళపతి కేసీఆర్ కి గ్యాప్ లేకుండా వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి.


 పార్టీలో ఇన్నాళ్లు పక్కనే ఉన్నది బాహుబలిని వెన్నుపోటు పొడిచిన కట్టప్ప లాంటి మనుషులే అన్నది ఇప్పుడిప్పుడే కెసిఆర్ కు అర్థం అవుతుంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంతోమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. చోటా చోటా నాయకులే కాదు.. ఇక టిఆర్ఎస్ లోని బడా బడా నేతలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు  ఇప్పటికే కేకే, ఆయన కూతురు జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్లో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక రంజిత్ రెడ్డి లాంటి మరికొంతమంది కీలక నేతలకు కూడా ఇప్పటికీ కాంగ్రెస్ లో చేరిపోయారు. కడియం కావ్య, కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగానే కనిపిస్తుంది. మేం గేట్లు ఓపెన్ చేస్తే మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండడు అని రేవంత్ చెప్పిన విషయమే ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుత పరిణామాల దృశ్య రేవంత్ పొలిటికల్ రివెంజ్ కెసిఆర్ కు మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది అంటూ కాంగ్రెస్ శ్రేణులు అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: