అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్ర రాజకీయం ఎంతలా వేడెక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించేందుకు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి.. జనసేన, బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతుంది. ఎన్డిఏ కూటమి ఇక ఈసారి ఆంధ్రాలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉంది. మరోవైపు నుంచి వైయస్ జగన్ సొంత చెల్లి షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి అన్నను ఓడించేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తోంది.


 ఇలాంటి పరిణామాల మధ్య ఇక ఆంధ్రాలో ఈసారి అధికారాన్ని చేపట్టబోయేది ఎవరు.. ఇక మెజారిటీ స్థానాలలో విజయం సాధించబోయే పార్టీ ఏది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక ఇలా ఎన్నికల హడావిడి మొదలైంది అంటే చాలు ఎన్నో రకాల సర్వేలు  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. కొన్ని సర్వేలలో చెప్పింది.. ఇక ఫలితాల తర్వాత నిజం అయితే.. కొన్ని సర్వేలు మాత్రం కేవలం అంచనాలుగానే మిగిలిపోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో.. ఇలాంటి సర్వేలు ఎన్నో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.


 ఇటీవల స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సంస్థ ఆంధ్రాలో ఎవరు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తారు అనే విషయంపై సర్వే రిపోర్టులో తెలిపింది. ఆంధ్ర రాజకీయాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 19 నుంచి 23 స్థానాల వరకు వస్తాయట. కాంగ్రెస్కు 0,  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2 నుంచి 6 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయట. అదే సందర్భంలో ఆరు పార్లమెంటు స్థానాలలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీఉంటుందట. ఒంగోలు, నంద్యాల, అనంతపురం, హిందూపురం, తిరుపతి, రాజంపేట పార్లమెంటు స్థానాలలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంటుందట. అయితే స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ ఇచ్చిన రిపోర్టు గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా నిజమైంది. ఇక మరోవైపు గోనె ప్రకాష్ రావు ఇచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం.. ఏపీలో ఎన్డీఏ కూటమికి అసెంబ్లీ ఎన్నికల్లో 120 నుంచి 144 సీట్లు వస్తాయని.. పార్లమెంట్ ఎన్నికల్లో 19 నుంచి 21 లోక్సభ స్థానాలో విజయం సాధిస్తుందట. పవన్ 50 వేల మెజారిటీతో పిఠాపురంలో గెలుస్తారని.. చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో ప్రజలు జగన్ నమ్మే పరిస్థితిలో లేరని.. జగన్ పాలనపై విరక్తితో ఉన్నారని.. అందుకే ఎన్డీఏ కూటమి తప్పక విజయం సాధిస్తుందని గోనే ప్రకాష్ రావు ఇటీవలే ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: