గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఒకచోట కూడా గెలవ లేకపోయిన పవన్ కళ్యాణ్ ఇక ఈసారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరీలోకి దిగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల తరఫున పోరాటం చేసేందుకు రెడీ అవుతున్నారు. తనను ఒక్కసారి గెలిపించి చూడండి నేనేంటో చూపిస్తా అంటూ ఇక ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో జనసేనని పవన్ కళ్యాణ్ కు మాత్రం చిక్కులు తప్పడం లేదు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఎన్నికల్లో ఓట్ల సంఖ్యను తగ్గించేలా మరో కొత్త చిక్కు వచ్చి పడింది అనేది తెలుస్తుంది.
ప్రస్తుతం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ గ్లాస్ గుర్తును పోలి ఉన్న బకెట్ గుర్తు జన సైనికులను ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఓటు వేయడానికి వెళ్ళిన వారు గాజు గ్లాస్ గుర్తు అనుకొని బకెట్ గుర్తుకు తమ ఓటు వేసే అవకాశం లేకపోలేదు. ఇక ఇది జనసేనకు వచ్చే ఓట్ల సంఖ్యను చీల్చే అవకాశం ఉంది. అయితే గుర్తు ఒకేలా ఉంటే ఏంటి కానీ పేరు చూసి ఓటు వేస్తారు అనుకున్న అక్కడ కొత్త చిక్కు ఏర్పడేలాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు గాజు గుర్తు లాగే బకెట్ గుర్తు కనిపిస్తూ ఉండగా.. ఇంకోవైపు నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కనుమూరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బరిలోకి దిగిపోతున్నారు. అయితే అటు పవన్ కళ్యాణ్ కు కూడా కే అనే అక్షరమే ఇంటిపేరుగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంటిపేరు కొణిదెలా ఇక ఇప్పుడు కనుమూరి పవన్ కళ్యాణ్ కు కూడా కే అనే అక్షరం ఇంటి పేరుగా వచ్చే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి