గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఇక ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలలో విజయ డంకా మోగించాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది  ఈ క్రమంలోనే ఇప్పటికే అన్ని స్థానాల్లో గెలుపు గుర్రాలను బలిలోకి దింపింది. కానీ కొన్ని స్థానాలలో మాత్రం కాంగ్రెస్ గెలుపు విషయంలో సందిగ్ధత నెలకొంది అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఖమ్మం స్థానం నుంచి కాంగ్రెస్ లో ఎవరికి టికెట్ దక్కబోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అయితే టికెట్ తమకే వస్తుంది అని ఎంతో మంది ఆశావాహులు ధీమాతో ఉన్నారు. తన భార్య నందిని కి ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి భట్టి, ఇక మాజీ మంత్రి మండవకు ఇవ్వాలని సీఎం రేవంత్, తన కుమారుడికి ఇవ్వాలని మంత్రి తుమ్మల, తన భార్య కాకుంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావుకు ఇవ్వాలని భట్టి ఖమ్మం సీటు తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని లేదంటే వియ్యంకుడు రఘురాం రెడ్డికి ఇవ్వాలంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పట్టుపట్టారు. దీంతో ఇక వీరిలో ఎవరికి సీటు దక్కబోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది  ఈ వ్యవహారం ఏకంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు వరకు వెళ్ళింది.


 అయితే ఇటీవలే ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారనే విషయంపై అధికారిక ప్రకటన రాకముందే కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాం రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం మరింత సంచలనంగా మారింది. అయితే ఈ నామినేషన్ వ్యవహారంతో ముఖ్యమంత్రి రేవంత్ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులకు పొంగులేటి చెక్ పెట్టాడని.. వారిద్దరు సూచించిన అభ్యర్థులను కాదని పొంగులేటి తన వియ్యంకుడుతో ఎంపీగా నామినేషన్ వేయించాడని గుసగుసలు వినిపిస్తున్నాయ్. పొంగులేటి కుటుంబ సభ్యులకు టికెట్ రాకుండా కాంగ్రెస్ నుంచి కీలక నేతలు అడ్డుకున్నారని అయినప్పటికీ వారి అభిప్రాయాన్ని కాదని పొంగులేటి తన వియ్యంకుడితో నామినేషన్ వేయించారట. అయితే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులకు గెలుపు కోసం పొంగులేటి ఆర్థికంగా ఆదుకున్నట్లు సమాచారం  దాదాపు 20 మంది అభ్యర్థుల ఖర్చును ఆయన భరించారట. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు లోక్సభ సీటు తనవారికి ఖరారు చేసుకున్న నేపథ్యంలో ఖమ్మంలోని మిగతా నేతల నుంచి ఆయనకు ఎంతవరకు సపోర్ట్ అందుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: