ఓటు హక్కు యొక్క ఆవశ్యకతను తెలియజేసేలా అటు ఎన్నికల అధికారులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొంతమంది స్వచ్ఛందంగా ఓటు హక్కు పై అవగాహన కనిపిస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఇక మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి ప్రతినెల లభించే జీతం ఎంత.. అంతేకాదు ఇతర అలవెన్సులు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకునేందుకు కూడా ఎంతో మంది ఆసక్తిని చూపిస్తున్నారు. ఒకసారి ఆ వివరాలు చూసుకుంటే..
పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తికి ప్రతినెల లక్ష రూపాయల జీతం వస్తుంది అదనంగా అలవెన్స్ లు రూ.1.30 లక్షలు లభిస్తాయి.
ఇక ఎంపిక గెలిచిన వ్యక్తికి, ఆయన భార్యకు ప్రతి ఏటా 34 సార్లు ఉచిత విమాన ప్రయాణం. అది కూడా ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ లో. రోడ్డు రవాణా అయితే కిలోమీటర్ కు 16 రూపాయలు చొప్పున అందుతుంది.
పాథలాజికల్ లాబరేటరీ, ఈసీజీ, డెంటల్, చర్మ కంటి ఆరోగ్య సేవలు కూడా ఉచితంగా లభిస్తాయి. ఢిల్లీలో ప్రత్యేకమైన భవనంలో నివాస వసతి కూడా కల్పిస్తారు.
ఇక ఎంపీగా గెలిచిన వ్యక్తి మూడు టెలిఫోన్లను వాడుకోవచ్చు. ఏడాదిలో 50వేల కాల్స్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఎంపీ పదవీకాలం పూర్తయిన తర్వాత ఇక ప్రతి నెల 50 వేల రూపాయల పింఛన్ అందుతుంది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి