ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో భాగంగా చంద్రబాబు కూటమిలో చేరడం వల్ల తనకు బాగా కలిసి వస్తుందని అనుకున్నారు.. దీంతో ఆంధ్ర ప్రదేశ్లో తనకి ఎదురు ఉండదని కూడా భావించిన చంద్రబాబు. చంద్రబాబు కోరుకున్నది మొత్తం వ్యవస్థ మొత్తం తన చేతులలోకి రావాలని కోరుకున్నారు.. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి తాత్కాలిక ఉండాలని కోరుకున్నారు. ఎన్నికలు ప్రారంభం అవుతుందో అప్పటినుంచి ఎన్నికల సంఘమే ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తుంది. ఇక్కడ ఆపద్బాంధ ముఖ్యమంత్రి హోదాలోనే ఉంటారు జగన్..


అయితే ఈ సమయంలో పవర్స్ చేతిలో ఉండకపోవడం వల్ల ఆపద్బాంధ ముఖ్యమంత్రిగా చెప్పవచ్చు. అక్కడ చంద్రబాబు కూడా కేంద్రంతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి.. మొత్తం మార్చేయగలనని ప్రయత్నం చేశారు.. అందులో 25 మంది ఐపీఎస్లను మార్పించడం కోసం పురందేశ్వరి తో ఏ ఏ అధికారులను ఉంచాలి.. మార్పులు చేయాలనే విషయం పైన ఒక లేఖ రాయించారు. అలాగే చీఫ్ సెక్రటరీలు డీజీల మార్పు కూడా చేశారు. రకరకాల మార్పుల కోసం చాలా ప్రయత్నించారు చంద్రబాబు.


అయితే అందులో డీజీపీలను మార్పించగలిగారు.. నలుగురు ఐపీఎస్ లను మార్పించగలగారు... అలాగే ఇంటలిజెంట్ చీపులను కూడా మార్చగలిగారు. అటు చీఫ్ సెక్రటరీ గానీ.. మిగతా పాతికమంది ఐపీఎస్ లను కానీ .. టీటీడీ ఈవోని కూడా మార్పించలేకపోయారు.. చంద్రబాబు కోరుకున్నటువంటి వాటిలో కేవలం 10 శాతం మాత్రమే సక్సెస్ అయ్యింది.. అయితే చంద్రబాబు పురందేశ్వరి కలిసి పలు రకాల ప్లాన్లు వేసినప్పటికీ కూడా అవి విఫలమయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి.. కూటమని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబు ఎన్నో రకాల విశ్వ ప్రయత్నాలు చేశారు. మరొకవైపు జనసేన పార్టీతో కూడా ఎన్నో మంతనాలు కూడా జరిపారు చంద్రబాబు. మరి చంద్రబాబు అనుకున్నట్టుగా ఏమాత్రం  జరగకపోవడంతో కాస్త నిరుత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది.. మరి ఏ మేరకు ప్రజల తీర్పు ఎవరి వైపు ఉంటుందో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఉండాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: