ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి వీడియో. పోలింగ్ సందర్భంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లిన ఆయన..ఈవీఎం ప్యాడ్ ను విసురుగా నేలకేసి కొట్టడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా బయటకు వచ్చి ఒక రేంజ్ లో బాగా వైరల్ అయ్యింది. పైగా దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావటం.. తీవ్రంగా పరిగణించటమే కాదు చర్యల కోసం ఏకంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి కోసం పోలీసులు పెద్ద ఎత్తున వెతుకులాట మొదలు పెట్టారు.ప్రస్తుతం హైదరాబాదులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాక్కున్నారని సమాచారం తెలుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎన్నికల సంఘం దీనిపై దృష్టి పెట్టి… వెంటనే రీ పోలింగ్కు అనుమతి ఇవ్వాలని తెలుగు దేశం పార్టీ కోరుతోంది. మరి దీనిపై ఎన్నికల సంఘం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


ఇక అటు టీడీపీ రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకే ఎమ్మెల్యే పిన్నెల్లి అలా చేసాడు అంటూ వైసీపీ పార్టీ బలంగా చెబుతోంది. మాచర్లలో ఈవీఎం ధ్వంసం వెనుక అసలు నిజాలివే అంటూ వైసీపీ పేర్కొంది. రెంటచింతల మండలం పాల్వాయిగేటులో వైయస్ఆర్‌సీపీ ఏజెంట్లని కొట్టి పోలింగ్ బూత్ నుంచి బయటికి పంపిందట తెలుగు దేశం పార్టీ. వైయస్‌ఆర్‌సీపీకి ఓటు వేసే అవకాశం ఉన్న ఓటర్లని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా వారిపై కూడా దాడి చేశారని అక్కడి జనాల నుంచి సమాచారం తెలుస్తుంది.అయిన ఈవిఎంని ధ్వంసం చెయ్యాల్సిన అవసరం ఏముంది? రేపు కౌటింగ్ లో ఏ పార్టీ గెలుస్తుందో? ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది కదా.. ధ్వంసం చెయ్యాల్సిన అవసరం ఏంటని ప్రజల నుంచి ఇంకా సోషల్ మీడియాలో నెటిజనుల నుంచి అనేక రకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఏదైనా దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఈ టాపిక్ హాట్ టాపిక్ అయ్యింది.మరి ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: