ఏపీ సీఎం వైఎస్ జగన్ గత ఐదేళ్లలో ప్రధానంగా సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టారు. జగన్ అమలు చేసిన నవరత్నాలు పథకాలు పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల జీవితాల్లో మార్పుకు కారణమయ్యాయి. అయితే గత ఐదేళ్లలో జగన్ మెచ్చిన ఐఏఎస్ లలో ఇంతియాజ్ అహ్మద్ ఒకరు. కృష్ణా జిల్లా కలెక్టర్ గా పని చేసిన ఇంతియాజ్ అహ్మద్ తర్వాత రోజుల్లో మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు.
 
మైనార్టీల సంక్షేమం కోసం జగన్ సర్కార్ ఇచ్చిన నిధులను క్షేత్రస్థాయికి చేరేలా అధికారులు శ్రద్ధ వహించడంలో ఇంతియాజ్ కీలక పాత్ర పోషించారు. మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం కోసం ఇంతియాజ్ అహ్మద్ తన వంతు కృషి చేశారు. సెర్ఫ్ బాధ్యతలను సైతం ఇంతియాజ్ నిర్వర్తించడంతో పాటు సీసీఎల్‌ఏ కార్యదర్శిగా కూడా ఆయన పని చేయడం గమనార్హం.
 
అయితే కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ సూచించగా ఇంతియాజ్ మరో ఏడాది పాటు పదవీ కాలం ఉన్నా పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2019 సంవత్సరంలో ఇంతియాజ్ అహ్మద్ కూతురు పెళ్లి జరగగా ఆ పెళ్లి వేడుకకు సీఎం జగన్ హాజరు కావడం జరిగింది. జగన్ మెచ్చిన ఈ మాజీ ఐఏఎస్ ఎలాంటి వివాదాలకు, విమర్శలకు తావివ్వకుండా పని చేసి ప్రశంసలు అందుకున్నారు,
 
కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పని చేసిన ఇంతియాజ్ అహ్మద్ ఎమ్మెల్యేగా గెలుస్తారేమో చూడాల్సి ఉంది. కర్నూలులో ఒకింత టఫ్ ఫైట్ ఉన్న నేపథ్యంలో ఇంతియాజ్ అహ్మద్ కచ్చితంగా గెలుస్తారని చెప్పలేమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సర్వేలలో అనుకూల ఫలితాలు రావడం వల్లే ఇంతియాజ్ కు జగన్ టికెట్ ఇచ్చారనే ప్రచారం కూడా జరుగుతోంది. కర్నూలు అసెంబ్లీ ఫలితం విషయంలో వైసీపీ నేతల్లో సైతం ఒకింత టెన్షన్ అయితే ఉంది. ఇంతియాజ్ అహ్మద్ మాత్రం గెలుపు విషయంలో నమ్మకంతో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: