ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఓడిపోగానే పార్టీ చచ్చిపోయినట్టు కాదు. ఇప్పటికీ అక్కడ ఆయనకు 45% వరకు వోట్ షేరింగ్ ఉంది. అంటే టిడిపి కంటే ఎక్కువగానే అక్కడ ఆయనకు బలం ఉందన్నమాట. కానీ జనసేన, బీజేపీతో కలపడం వల్ల టిడిపికి కలిసివచ్చింది తప్ప జగన్ మాత్రం ఓడిపోయినట్టు కాదు. కొత్త పార్టీని స్థాపించి కేవలం కొన్ని సంవత్సరాలలోనే అధికారంలోకి తీసుకువచ్చి పార్టీ కార్యకర్తలను  తయారు చేసుకున్నటువంటి టాలెంట్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.  సింహం ఎప్పుడైనా సింగిల్ గానే వస్తుంది అనే నానుడికి పక్కా సూట్ అవుతారు ఈయన. 

జగన్మోహన్ రెడ్డి  ఓటమిలకు భయపడే వ్యక్తి కాదు. పడి లేచిన కెరటం. ఆయన తప్పకుండా కం బ్యాక్ కావాలని ప్రజా క్షేత్రంలోకి రావాలని చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు. కానీ జగన్ తాను ఎందుకు ఓడిపోయాడు..దానికి కారణమేంటనేది తీసుకొని తనకు సపోర్ట్ చేసే వారందరికీ భరోసా ఇస్తూ  నేనున్నానని చెప్పాలి. తన కింద గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలను తన వెంటే ఉంచుకుంటూ టిడిపి చేసేటువంటి తప్పులను ఎత్తిచూపుతూ  ప్రజా క్షేత్రంలో తిరగాలి. ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటూ,  వైసీపీని మళ్లీ కంబ్యాక్ చేసే ప్రయత్నాలు తప్పక చేసుకోవాలి.  

కేవలం కూటమి ఎక్కువ సీట్లు గెలిచినంత మాత్రాన క్యాడర్ ఏమాత్రం తగ్గించలేకపోయారు. వైసిపికి ఉండే ఓట్ షేరింగ్ మొత్తం అలాగే ఉంది. దీన్నే ప్రధాన అస్త్రంగా తీసుకొని  బరిలో దూకాలి జగన్మోహన్ రెడ్డి.అలా అయితేనే వైసిపి రాబోవు ఐదు సంవత్సరాల్లో ప్రజల్లో బలపడి వచ్చే ఎలక్షన్స్ లోపు అద్భుతమైన శక్తిగా ఎదుగుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలా అయితేనే పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని, వైసిపి కార్యకర్తల్లో కూడా కాస్త ధైర్యం పెరుగుతుందని  అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అలా చేస్తారా లేదంటే సైలెంట్ అయిపోతారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: