ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాలుగవసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో వైసిపి కనీసం ప్రతిపక్ష హోదా కూడా సంపాదించు కోలేకపోయింది. కూటమికి మొత్తం 164 సీట్లు రాగా,  వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. వైసిపి ఇంతటి ఓటమిని అస్సలు తట్టుకోలేకపోతోంది. దీంతో ఏమీ చేయలేక ఈవీఎం ట్యాంపరింగ్ జరి గిందని ఒక  విషయాన్ని లేవనెత్తారు. దీనిపై జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేయడంతో  అది మరింత ఆసక్తికరంగా మారింది. 

 కట్ చేస్తే 2019 ఎన్నికల్లో వైసిపి 151 సీట్లలో ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలోనే టిడిపి నాయకులు కూడా ట్యాపరింగ్ జరిగిందని అన్నారు.  కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని కొట్టి పారేశారు.ఈ తరుణంలో కూటమి అధికారంలోకి వచ్చింది . 164 సీట్లు సాధించింది. దీంతో అధినేత జగన్ కూడా ట్యాంపరింగ్ జరిగిందని ట్వీట్ చేయడంతో, టిడిపి నాయకులు జగన్ గెలిచినప్పుడు మాట్లాడినటువంటి వీడియోలు ట్యాగ్ చేస్తూ  కామెంట్లు పెట్టారు. ఈ విధంగా సాగు తున్న తరుణంలో  వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఒక వ్యక్తి  ట్యాపరింగ్ లేదు ఏదీ లేదు అంటూ కొట్టిపారేసాడు  ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే  రాపాక వరప్రసాద్.

 2019 ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచి వైసిపి లో చేరారు. ఈ ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుంచి  పోటీ చేసి ఓడిపోయారు.  అలాంటి రాపాక తాజాగా ఒక మీడియాతో మాట్లా డుతూ ట్యాంపరింగ్ అనేది ఏమీ జరగలేదని , అదంతా అబద్ధమే అని, తెలుగుదేశం, బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడడం వల్లే  ఇంతటి విజయం సాధ్యమైందని అన్నారు. అది క్లియర్ గా కనిపిస్తుంటే ఈవీఎంల మీద ఆరోపణలు చేయడం అర్థంపర్థం లేని మాటలని కొట్టి పారేశారు. ప్రస్తుతం ఆయన ఇలా మాట్లాడడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: