జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీలో పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి తర్వాత అంతటి స్థాయిలో డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. ఇంకోవైపు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీ అయిపోయారు. అయితే ఇలా పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో సూపర్ సక్సెస్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ అందరిలో ఒకే ప్రశ్న. ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా మారిపోయిన పవన్ కళ్యాణ్ ఇక ఇప్పుడు సినిమాలు చేస్తారా అనే విషయంపైనే అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే గతంలోనే రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలను పక్కన పెట్టేశారు. కానీ ఆ తర్వాత పార్టీని నడిపేందుకు ఆదాయం లేక మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలు చాలానే లిస్టులో ఉన్నాయి. కొన్ని సగం వరకు షూటింగ్ జరిగాయ్. ఈ సినిమాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఇలా ఒక వైపు రాజకీయాలను మరోవైపు సినిమాలను ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నది ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో నెలకొన్న ప్రశ్న. ఏకంగా పిఠాపురం ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి చూస్తూనే మంత్రిగా ఇక గ్రామీణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. ఇంకోవైపు డిప్యూటీ సీఎం గా ప్రభుత్వంలోని కొన్ని కీలక బాధ్యతలను చూసుకోవాలి. ఇంకోవైపు అసెంబ్లీలో ఇక ప్రజల సమస్యలను దృష్టికి తీసుకువచ్చే విషయంపై ఫోకస్ చేయాలి. ఇన్ని పనుల మధ్య ఇక పవన్ కళ్యాణ్ ఎంతవరకు సినిమాలపై ఫోకస్ చేయగలరు అనే విషయం పైన చర్చ జరుగుతుంది. అయితే గతంలో రాజకీయాలను సినిమాలను బ్యాలెన్స్ చేసిన పవన్ కళ్యాణ్ ఇక ఇప్పుడు కూడా అలా బ్యాలెన్స్ చేసే అవకాశం ఉందని కనీసం ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలను అయినా కంప్లీట్ చేసే ఛాన్స్ ఉందని ఎంతోమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: