కూటమి ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చి నెల రోజులు అయిందో.. లేదో.. అప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు, కార్యకర్తల మధ్య గొడవలు.. గ్రూపులు మొదలైపోయాయి. ఈ గ్రూపులు.. గొడవలలో తొలి పేరు జనసేన ఎమ్మెల్యేదే కావటం విశేషం. తిరుపతిలో పొలిటికల్ గేమ్ అప్పుడే మొదలైంది. జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులపై సొంత పార్టీతో పాటు.. టిడిపి నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని చెప్పాలి. వాస్తవంగా ఆరణి శ్రీనివాసులు వైసీపీ నేత. మొన్నటి వరకు ఆయన చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే జనసేనలో చేరిన ఆయనకు పవన్ కళ్యాణ్ తిరుపతి సీటు ఇచ్చారు. అప్పటికే తిరుపతిలో ఎమ్మెల్యే సీటు కోసం జనసేన, టిడిపి నుంచి చాలామంది రేస్‌లో ఉన్నారు.


వారందరినీ కాదని చిత్తూరుకు చెందిన ఆరణి శ్రీనివాసులు సీటు ఇవ్వడంతో అసంతృప్తి రగిలింది. అయినా వారందరూ పార్టీ కూటమి నిర్ణయానికి కట్టుబడి పని చేసి శ్రీనివాసులను 50 వేల పై చిలుకు ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారు. అయితే ఆరణి రాజకీయంగా తమ పన్నాగాలు పారనివ్వటంలేదని.. అప్పుడే కొందరు ఆయనపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. నాన్ లోకల్ నాయకుడిగా ఉండి తిరుపతిలో గెలిచి తమపై పెత్తనం చేయటం ఏంటన్న అసంతృప్తి అటు జనసేన నాయకులతో పాటు.. ఇటు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా కనిపిస్తోంది. తనపై కొందరు నేతలు వ్యతిరేక ప్రచారం చేయడాని.. పసిగట్టిన ఎమ్మెల్యే ఆరణి వార్నింగ్ ఇస్తున్నారు.


తను తిరుపతికి పోటీ చేయడానికి వస్తే గోబ్యాక్ అంటూ నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు వేసి.. తనను ఓడించడానికి కుట్రలు చేసింది ఎవరో..? తనకు బాగా తెలుసని వార్నింగ్ ఇస్తున్నారు. ఏది ఏమైనా ఎన్‌డీఏ ప్రభుత్వం కొలువుదీరి కనీసం నెలరోజులు కూడా కాకుండానే తిరుపతిలో కూటమి పార్టీలో అసమ్మ‌తి జ్వాలలు రగులుతుండటంపై.. పెద్ద ఎత్తున చర్చి జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే రాష్ట్రవ్యాప్తంగా పిఠాపురంతో పాటు.. గోదావరి జిల్లాలోని నియోజకవర్గాలలో జనసేన క్యాడర్.. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలపై అసంతృప్తి జలాలు విరజిమ్ముతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: