* వైసీపీని ఒక ఆట ఆదుకునేందుకు సిద్దమవుతున్న టీడీపీ నేతలు
* టీడీపీ అరాచకాలపై ఘాటుగా ప్రశ్నించేందుకు సిద్దమైన జగన్
* పూర్తి స్థాయిలో దృఢంగా పోరాడగలరా ..?
ఆంధ్రప్రదేశ్ లో 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలల్లో టీడీపీ ,బీజేపీ ,జనసేన కూటమి తిరుగులేని విజయం సాధించింది.గత ఎన్నికలలో 151 సీట్లు సాధించి సంచలనం సృష్టించిన వైసీపీ పార్టీ ఈ సారి కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి ప్రతి పక్ష హోదా కోల్పోయింది.మాజీ సీఎం జగన్ గత ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి నేరుగా ప్రజల ఖాతాలోనే డబ్బు జమ చేసారు. రాష్ట్రంలో అప్పు అనే పెను భారం పెరుగుతున్న కూడా జగన్ పేదల ఖాతాలో డబ్బు జమ చేసారు. అయితే సంక్షేమంపై పెట్టిన శ్రద్ద జగన్ ప్రభుత్వం ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలు , పెరుగుతున్న నిత్యావసర ధరలపై నియంత్రణ చూపకపోవడం వంటి పలు సమస్యలపై పెట్టకపోవడం జగన్ కు ఈ సారి ఓటమి తప్పలేదు.అంతేకాకుండా తన హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయించడం కూడా జగన్ ఓటమికి ఒక కారణంగా చెప్పవచ్చు.గత ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్స్ గా నిలిచిన మంత్రులు సైతం ఈ సారి ఘోర ఓటమి చెందారు.ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా వుంది.
ఇదిలా ఉంటే పాలనలో నెల రోజులు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది.నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టారు.రాష్ట్ర ప్రజలకు తాను ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పధక రచన చేస్తున్నారు.ఇప్పటికే మెగా డిఎస్సి ప్రకటించి నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిల బెట్టుకున్న చంద్రబాబు త్వరలోనే తానూ హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పధకాలను అమలు చేయనున్నారు.ఇదిలా ఉంటే రేపటి నుంచి ఐదు రోజుల పాటు
అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి.ఈ సమావేశాల్లో 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.జులై 22 ఉదయం 10 గంటలకు గవర్నర్ శాసనసభ ,మండలిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఈ సమావేశాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టనుంది.అలాగే శాంతి భద్రతలు ,మద్యం ,ఆర్ధిక శాఖలపై శ్వేతపత్రాలను అసెంబ్లీ లో ప్రభుత్వం విడుదల చేయనుంది.
ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న వైసీపీకి ఇంకా సీట్ల కేటాయింపు జరగకపోవడంతో మాజీ సీఎం జగన్ కు ముందు వరుసలో సీటు దక్కడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.సాధారణ సభ్యుడిగానే జగన్ ఎక్కడో ఓ చోట కూర్చోవాలని ప్రతిపక్ష నేతగా ముందు వరుసలో కూర్చునే అవకాశం లేదని అధికారపక్షం చెబుతుంది.దీనితో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.అయితే వైసీపీ హయాంలో టీడీపీ అక్రమాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి తన మంత్రులతో టీడీపీ నేతలను దుర్భాషలు ఆడించిన జగన్ కు రేపు అసెంబ్లీలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రేపు జరిగే అసలైన అసెంబ్లీ ఆటలో జగన్ పూర్తి స్థాయిలో నిలబడతారా లేక మధ్యలోనే వాకౌట్ చేస్తారా అనేది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి