- క‌మ‌లానికి గులామ్ అంటోన్న గులాబీ ద‌ళం
- క‌విత‌కు బెయిల్ కోసం కేటీఆర్ - హ‌రీష్ లో కంగారు

( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) .

తెలంగాణలో బీర్ ఎస్ పార్టీ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా కనిపిస్తోంది. అసలు పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ గులాబీ పార్టీయేనా ? అన్న సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి. పదేళ్లు అధికారంలో ఉండి వరుసగా రెండు ఎన్నికలలో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఒకే ఒక్క ఓటమి దెబ్బతో క‌కావిక‌లం అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన అరాచకాలు .. అవినీతి ... అహంకార రాజకీయాలకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిణామాలు అనుభవిస్తోంది. తాజాగా పరిణామాలు చూస్తుంటే బిజెపికి పూర్తిస్థాయిలో లొంగిపోవటానికి గులాబీ పార్టీ సిద్ధమైందని ఎవరికైనా అర్థమవుతుంది.


దశాబ్దాలుగా కోట్లాడి తెలంగాణను సాధించిన పార్టీ బిజెపికి ఎందుకు ? లొంగిపోతుంది అన్నది చాలామందికి అర్థం కావడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు బెయిల్ కోసమే పార్టీని త్యాగం చేయాలా అంటే ఎల్లకాలం ఎవరిని జైల్లో పెట్టలేరు ... ఇవాళ కాకపోతే రేపు అయినా కచ్చితంగా బెయిల్ వస్తుంది . ఈ విషయంలో సందేహం లేదు .. కానీ హరీష్ రావు - కేటీఆర్ ఎందుకు ఈ విషయంలో కంగారు పడుతున్నారో అర్థం కావడం లేదు. కేసీఆర్ అంటే డైనమిక్ లీడర్ గతంలో బిజెపితో మోడీతో యుద్ధమే అని ప్రకటించారు. పైగా తన పార్టీని బీఆర్ఎస్ నుంచి భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు. మోడీతో క‌య్యానికి కాలు దువ్వారు. అలాంటి నేత ఇప్పుడు బిజెపితో వ్యవహరిస్తున్న విధానం చూస్తే ఇంతగా ఎందుకు వెనక్కి తగ్గాల్సి వస్తుంది అన్నది ఎవరికీ అంతు ప‌ట్ట‌ని విషయం. ఏదేమైనా ఇంత బ‌తుకు బ‌తికి ఇంత దారుణంగా చేతులు ముడుచుకుని కూర్చోవ‌డం బీఆర్ ఎస్ పార్టీకి.. ఆ పార్టీ కీల‌క నేత‌ల‌కే చెల్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి: