కూటమి ప్రభుత్వంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణం చేసేస్తారని ఒక కొత్త బాంబును పేల్చారు విజయసాయిరెడ్డి.. బ్లాస్ట్ ఫర్నేస్ -3 నిలిపి వేయడమంటే అది కచ్చితంగా స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగులను గొంతు కోయడమే అన్నట్టుగా తెలిపారు.. తెలుగు జాతికి చంద్రబాబు పెద్ద ద్రోహం చేస్తున్నారని ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి మౌనంగా ఉన్నారని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడగడం లేదని ఉక్కు మంత్రిత్వ శాఖకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపడమే అన్నట్లుగా తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది ఇప్పటికే ప్రాణ త్యాగం చేశారు..
అలాంటిది ఇప్పుడు ఈ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించే వారే లేక అనాధగా మిగిలిపోయింది అంటూ తెలిపారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఈ స్టీల్ ప్లాంట్లను కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం చాలా బాధాకరంగా ఉందని తెలుగుజాతి ద్రోహిగా మిగిలిపోతారు అంటూ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఇలా చేయడం వల్ల వేలాదిమంది కార్మికులు కూడా రోడ్డున పడతారని.. చంద్రబాబు కాపాడే శక్తి ఉన్న నిర్లక్ష్యంగా ఉన్నారంటూ మండిపడ్డారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు సీఎం గా ఉన్న సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను చాలా జాగ్రత్తగా కాపాడారు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన ఎప్పటికీ కూడ పోరాడుతూనే ఉంటారని తెలిపారు.ఐదేళ్లు మౌనంగా ఉన్న కేంద్ర ఇప్పుడు హఠాత్తుగా మూసివేసే సాహసం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు విజయసాయిరెడ్డి.