
గ్యాస్ వినియోగదారులకు ఈ అదనపు భారం తప్పడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి నిర్ణీత దూరం వరకు ఉచితంగానే సిలిండర్లను సరఫరా చేయాలి. అయితే డెలివరీ బాయ్స్ తాము అడిగినంత ఇవ్వాల్సిందేనని కోరుతుండటం గమనార్హం. సిలిండర్ డెలివరీ సిబ్బంది ఇచ్చే రశీదులను పరిశీలించి రశీదు ఆధారంగా బిల్లులను చెల్లిస్తే ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉండదు.
సాధారణంగా చమురు సంస్థలు ఏజెన్సీలకు ఒక్కో సిలిండర్ కు 65 రూపాయల చొప్పున చెల్లించడం జరుగుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లలో గృహ సిలిండర్లను వినియోగించడం విషయంలో సైతం ఫిర్యాదులు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. ఏపీ సర్కార్ వినియోగదారుల సౌకర్యార్థం 1967 టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేసింది. అక్రమాలు జరిగితే ఈ నంబర్ కు సులువుగా ఫిర్యాదు చేయవచ్చు.
ఏజెన్సీల నిర్వాహకులు డెలివరీ బాయ్స్ ను కట్టడి చేయని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తామని వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని చెబుతున్నారు. ఏపీ సర్కార్ ప్రజలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు