తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్రంలో ఓ బ్లాస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఓ మంత్రి కారులో రక్తం వచ్చేలా కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొడుతోంది. గులాబీ పార్టీ రెబల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.. పైన కాంగ్రెస్ పార్టీ ఎంపీ దాడి చేసినట్లు కూడా చెబుతున్నారు.

 ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. ఈ వివాదం రోజురోజుకు పెరుగుతుందని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. గద్వాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరిత వర్సెస్ బంగ్లా కృష్ణమోహన్ రెడ్డి అన్నట్లుగా వ్యవహారం కొనసాగుతోందట. వీళ్ళిద్దరి కారణంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వర్గ పోరు తారస్థాయికి చేరుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

 సరితను ప్రభుత్వ అలాగే పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకుండా.... ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై సరిత చాలా గుర్రుగా ఉన్నారట. ఈ తరుణంలోనే తాజాగా తెలంగాణ మంత్రి పొంగులేటి... కారులో ఈ నేతలందరూ గొడవ పడ్డట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పైన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చేయి చేసుకున్నట్లు సమాచారం.

 మల్లు రవి పైన అదే స్థాయిలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రియాక్ట్ అయినట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ సంఘటనలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముక్కు నుంచి రక్తస్రావం వచ్చినట్లు.. గులాబీ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇక ఆ గొడవను ఆపకుండా మంత్రి పొంగులేటి మౌనంగానే ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియా వైరల్ గా మారింది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: