భారతదేశ ఆర్మీ అమ్ములపొదిలోని ఆకాష్ మిస్సైల్ ని బయటకు తీసింది. మరి ఇంతకీ ఈ ఆకాష్ మిస్సైల్ అంటే ఏంటి..ఇది ఎక్కడ తయారు చేశారు.. దీన్ని సామర్థ్యం ఏంటి... దీని స్పెషాలిటీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. భారతదేశ అమ్ముల పొదిలో ఎన్నో రకాల మిసైల్స్ ఉన్నాయి. వీటి సామర్థ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ దిశ నుండి ఎలాంటి డ్రోన్ వచ్చినా మిస్సైల్ వచ్చినా ఎదుర్కొనగల శక్తివంతమైన మిస్సైల్స్ మన దగ్గర ఉన్నాయి. వాటిలో ఒకటే ఈ ఆకాష్ మిస్సైల్.. ఇక ఈ ఆకాష్ మిస్సైల్ ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంది కాదు. మన దేశంలోనే దీన్ని తయారు చేశారు. ఆత్మ నిర్బర్ కింద డిఆర్డిఓ సంస్థ దీనిని తయారుచేసింది. అయితే ఈ ఆకాష్ మిస్సైల్ అద్భుతమైన సమర్ధత కలిగి ఉండడంతో ఇతర దేశాలకు ఈ ఆకాష్ మిస్సైల్ ని ఎగుమతి చేయాలని కూడా అనుకున్నారు.

అలా 2020 సంవత్సరంలో కేంద్ర మంత్రివర్గం కూడా దీనికి ఆమోదం తెలిపింది. ఇక మన రక్షణ రంగంలో ఉన్న అత్యంత పవర్ఫుల్ మిస్సైల్స్ లో ఆకాష్ మిస్సైల్ కూడా ఒకటి.ఈ ఆకాష్ మిస్సైల్ ఆకాశంలో ఏ దిశ నుండి ఎలాంటి మిస్సైల్, డ్రోన్ వచ్చినా కూడా అన్నింటినీ ఏకకాలంలో చిత్తు చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఆకాష్ మిస్సైల్ 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా సమర్థవంతంగా ఛేదించగల స్పెషాలిటీ ఉంది. ఇది మల్టిపుల్ ఎయిర్ అటాక్.. ఎందుకంటే ఏ దిశ నుండి అయినా సరే డ్రోన్ లేదా మిస్సైల్ ఏది వచ్చినా సరే ఏకకాలంలో వాటన్నింటిని నేలమట్టం చేస్తుంది.

అంతేకాదు దాడి జరిగే తీవ్రతను కూడా ఈ మిస్సైల్ ముందుగానే పసిగడుతుంది.అయితే అమ్ములపొదిలో ఉన్న ఈ ఆకాష్ మిస్సైల్ ని తాజాగా భారత్ బయటకు తీసింది.ఇండియా లోని జమ్ము కాశ్మీర్ పై పాకిస్తాన్ మిస్సైల్స్,డ్రోన్లను వదిలినప్పుడు వాటిని నేలమట్టం చేయడం కోసం ఇండియన్ ఆర్మీఆకాష్ మిస్సైల్ ని వాడినట్టు తెలియజేశారు. ఇక మిస్సైల్ లను,డ్రోన్లను నేల మట్టం చేయడంలో ఆకాష్ మిస్సైల్ సమర్థవంతంగా పనిచేసినట్టు ఇండియన్ ఆర్మీ తెలియజేసింది. అలా ఎన్నో అద్భుతమైన స్పెషాలిటీలు ఉన్న ఆకాష్ లాంటి మిస్సైల్స్ మన భారతదేశ ఆర్మీ దగ్గర ఎన్నో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: