సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా లవ్ మ్యారేజ్ లు వంటివి జరుగుతూ ఉంటాయి అయితే అరేంజ్ మ్యారేజ్ అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక బాలీవుడ్ స్టార్ హీరో మాత్రం ఇద్దరిని చూసి ఒకరికొకరు సరిజోడు అవుతారని భావించి మరి వివాహం చేయడం జరిగిందట. ఆ పని చేసింది బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ఆసిన్, రాహుల్ శర్మ 2006లో ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. రాహుల్ శర్మ మైక్రోమ్యాక్స్ కో ఫౌండర్ గా పనిచేసేవారట.


ఆసిన్, రాహుల్ శర్మ ప్రేమ కథలో అక్షయ్ కుమార్ కీలకమైన పాత్ర ఉందట. 2012లో ఒక క్రికెట్ మ్యాచ్ లో ఒకరినొకరు పరిచయం చేసుకున్నారని ఆ తర్వాతే వీరిద్దరూ కలవడానికి కూడా తను సహాయం చేశానని ఆ పెళ్లి సమయంలో ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కొన్న మైక్రోమ్యాక్స్ కంపెనీ ఆ తర్వాత ఒక్కసారిగా పతాక స్థాయికి పడిపోయింది. 2010లో మైక్రోమ్యాక్స్ భారతదేశంలో అతిపెద్ద బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. ఇండియన్ మార్కెట్లో ఎన్నో కంపెనీలను ఓడించి మరి బ్రాండ్ సంపాదించుకుంది మైక్రోమాక్స్.


కానీ చైనీస్ స్మార్ట్ ఫోన్లు రంగంలోకి ప్రవేశించడంతో ఆ తర్వాత మైక్రోమ్యాక్స్ బ్రాండ్స్ తగ్గిపోయాయి. అయితే ఈ విషయం పైన ఆసిన్ భర్త రాహుల్ కూడా పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారట. 2014లో చైనీస్ ఫోన్ బ్రాండ్ మీజుతో ఒప్పందం సందర్భంగా మైక్రోమ్యాక్స్ కి $800 మిలియన్ ఫండ్స్ ఆఫర్ వచ్చిందని తెలిపారు. అయితే ఈ ఆఫర్ ని తాను తిరస్కరించామని అప్పుడు బిజినెస్ లాభాలలో ఉండేది డబ్బు అవసరం లేదని తాను భావించామని.. మేము అప్పుడు చాలా స్థిరపడిపోయాము డబ్బు అవసరం లేదు అనుకున్నాము.. కానీ పోటీ అనే పదాన్ని గ్రహించలేకపోయానని తెలిపారట. కొరియా , ఫిన్లాండ్ వంటి బ్రాండ్లను వ్యవహరించినట్లుగానే చైనాని కూడా హ్యాండిల్ చేయగలమని అనుకున్నామని ఆ సమయంలో మైక్రోమ్యాక్స్ చైనా కంపెనీలను తక్కువ అంచనా వేసిందని తెలిపారు.

కానీ చైనీస్ బ్రాండ్లు చాలా చౌక ధరకే మార్కెట్లోకి రావడం భారీగా డిమాండ్ పెరిగిపోవడంతో భారీగానే మార్కెట్ ని సంపాదించుకుంది. 2016లో ఆసిన్ ను పెళ్లి చేసుకున్న మూడేళ్లకే కోలుకోలేని స్థితిలోకి పడిపోయిందట. అక్షయ్ కుమార్ ,ఆసిన్ యొక్క సింప్లిసిటీ, ప్రొఫెషనల్ చూసి మరి రాహుల్ తో వివాహమైతే ఒకే వ్యాల్యూస్ వంటివి ఉంటాయని గుర్తించి మరి వీరిద్దరికి వివాహానికి సహాయం చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: