ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశాడు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్న అమెరికా... తాజాగా సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ యుద్ధం పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశాడు. పాకిస్తాన్ అలాగే ఇండియా కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయని ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు డోనాల్డ్ ట్రంప్.

 రాత్రంతా రెండు దేశాల అగ్రనేతలతో చర్చలు జరిగాయని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించామని ఈ సందర్భంగా పోస్టులో డోనాల్డ్ ట్రంప్ తెలిపాడు.  ఈ.. తరుణంలోనే భారత్ అలాగే పాకిస్తాన్ 2 దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయని వివరించాడు. దీంతో యుద్ధం ఆగిపోయినట్లేనని ఆయన చెప్పకనే చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటన చేయకముందు... డోనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు.


 దీంతో రెండు దేశాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. ఇది ఇలా ఉండగా జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం  ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు రచ్చ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఉగ్ర వాదుల కారణంగా మొత్తం 28 మంది ఇండియన్ యాత్రికులు చనిపోయారు. ఇందులో ఇద్దరు విదేశీ యాత్రికులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్న స్థావరాలపై ఇండియా అటాక్ చేసింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా ఈ యుద్ధం ఆగిపోయినట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపాడు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: