ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకవైపు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరొకవైపు ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నప్పటికీ ఎన్నో విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా డ్వాక్రా మహిళలకు సైతం ఒక గుడ్ న్యూస్ ని తెలిపింది కూటమి ప్రభుత్వం. వారు తీసుకున్న రుణాలను చెల్లింపును మరింత సులభంగా చేసేలా అడుగులు వేస్తున్నారు.. మోసాలను సైతం మరికట్టేందుకు ఒక యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారట ఏపీ ప్రభుత్వం.  ఇప్పటికే వాట్సాప్ గవర్నమెంట్ అందుబాటులో తీసుకురావడం జరిగింది. దీనివల్ల ప్రజలకు సేవలు మరింత దగ్గరగా చేసింది కూటమి. ప్రభుత్వం.


అయితే ఇలాంటి సమయంలోనే డ్వాక్రా మహిళల కోసం ఒకసారి కొత్త యాప్ ని ఏపీ ప్రభుత్వం తీసుకురాబోతోందట. రుణాలను సులభంగా చెల్లించడానికి మోసాలను అరికట్టడానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుందని తెలుపుతున్నారు. ఇకపై ఇంట్లో నుంచి దర్జాగా మొబైల్ నుంచి డబ్బులు కట్టే విధంగా ఒక యాప్ ని తీసుకురాబోతోంది ఏపీ ప్రభుత్వం. ఈ యాప్ ద్వారా శ్రీనిధి రుణాల వాయిదాలను మొబైల్ నుంచే ప్రతి ఒక్కరు చెల్లించుకోవచ్చని తెలియజేస్తోంది .ముఖ్యంగా బ్యాంకులలో వాయిదాల చెల్లింపు విషయాలలో జరుగుతున్న  మోసాలను అధికారులు తెలియజేయడంతో ఒక యాప్ ద్వారా బ్యాంకు లింకు చేసి మరి శ్రీనిధి రుణాలను అందించే విధంగా ప్లాన్ చేస్తోంది.

ఈ యాప్ ఉపయోగించడానికి ఎలాంటి చార్జెస్ అవసరం ఉండదని తెలియజేస్తున్నారు. మరొకవైపు ఇటీవలే మెప్మా వెబ్ సైట్ ను సైతం ప్రారంభించారు. దీనివల్ల భవిష్యత్తులో 80 వేల డ్వాక్రా సంఘాలకు సైతం ఎనిమిది వేల కోట్ల రూపాయలు రుణాలను అందించే విధంగా ప్లాన్ చేస్తున్నదట కూటమి ప్రభుత్వం. అయితే ఇందుకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలకే మెప్మా పిడీలు ఉన్నాయని రాబోయే రోజుల్లో వాటిని 26 జిల్లాలకు పెంచుతామంటూ ఆమె ఇవ్వడం జరిగింది మంత్రి నారాయణ.

మరింత సమాచారం తెలుసుకోండి: