పాకిస్తాన్ పల్లవి అందుకునే దేశాలకు ఆంధ్రప్రదేశ్ గట్టి షాకిచ్చింది. టర్కీ, అజర్‌బైజాన్‌లకు మనోళ్లు మామూలు ఝలక్ ఇవ్వలేదు, ఏకంగా పర్యాటక రంగంపైనే దెబ్బకొట్టారు. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటే ఏ శక్తీ ఆపలేదని మరోసారి రుజువైంది. గతంలో పాలరాళ్లు, యాపిల్ వ్యాపారులు చూపిన తెగువ ఇప్పుడు పర్యాటక రంగంలోనూ ప్రతిధ్వనించింది.

విషయం ఏంటంటే, ప్రతీ ఏటా మన ఆంధ్రా నుంచి వేలమంది హాలిడే ఎంజాయ్ చేయడానికి టర్కీ, అజర్‌బైజాన్ లాంటి దేశాలకు క్యూ కట్టేవారు. దాదాపు 12 వేల మంది పర్యాటకులు మన రాష్ట్రం నుంచి వెళ్తుండేవారంటే ఆ దేశాలకు మనవాళ్ళ నుంచి ఎంతటి ఆదాయం సమకూరుతుందో ఊహించుకోండి. వందల కోట్ల రూపాయల వ్యాపారం అది.

కానీ, ఇప్పుడు ఆంధ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. టర్కీ, అజర్‌బైజాన్‌లకు వెళ్లే అన్ని టూర్ ప్యాకేజీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, ఆయా దేశాలకు వెన్నులో వణుకు పుట్టించింది. ఇది కేవలం వ్యాపార నిర్ణయం కాదు, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం. ఆంధ్రా పర్యాటక సంస్థలు తమ గుండెల్లో దేశభక్తి జ్వాల రగులుతోందని నిరూపించాయి.

ఈ దెబ్బతో పాకిస్తాన్‌కు కొమ్ముకాసే దేశాలకు ఇది ఒక హెచ్చరిక గంట కావాలి. భారతీయతను, దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తే ఇలాంటి ఎదురుదెబ్బలు తప్పవని ఆంధ్రులు చాటిచెప్పారు. ఇకపై ఆ దేశాల పర్యాటక ఖజానాకు మన ఆంధ్రా నుంచి చిల్లిగవ్వ కూడా వెళ్ళదు. ఇది కదా అసలైన దెబ్బ అంటే, ఆంధ్రా పౌరుషం అంటే ఇదే మరి అని ఈ విషయం తెలుసుకున్న చాలా మంది కామెంట్ చేస్తున్నారు.

ఈ దెబ్బతో ఆ దేశాల ఆర్థిక పునాదులు కదిలిపోవడం ఖాయం అని అంటున్నారు. శత్రువులకు అండగా నిలిస్తే, ఇలాంటి ఆర్థిక దాడులు తప్పవని ఆంధ్రులు తమ చర్యల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారని ప్రశంసిస్తున్నారు. ఇది కేవలం పర్యాటక నిషేధం కాదు, ఓ వ్యూహాత్మక ఆర్థిక అస్త్రం. ఆంధ్రా గర్జన ఇప్పుడు యావత్ దేశానికి స్ఫూర్తినిస్తోంది, వాళ్ల ఖజానాకు మన డబ్బుతో పడిన గండి ఇప్పుడే మొదలైంది. మన డబ్బుతో మనకే సున్నం పెట్టాలనుకునే వారికి ఇదే సరైన గుణపాఠం.

మరింత సమాచారం తెలుసుకోండి: